Warren Buffett 'బెర్క్‌షైర్ హాత్వే' పేరుతో నకిలీ క్రిప్టో వెబ్‌సైట్

by Harish |   ( Updated:2022-11-19 07:55:40.0  )
Warren Buffett బెర్క్‌షైర్ హాత్వే పేరుతో నకిలీ క్రిప్టో వెబ్‌సైట్
X

న్యూయార్క్: ప్రపంచ దిగ్గజ వ్యాపారవేత్త,పెట్టుబడిదారుడు అయిన వారెన్ బఫె‌ట్‌కు చెందినటువంటి 'బెర్క్‌షైర్ హాత్వే' పేరును ఉపయోగించి నడుస్తున్నటువంటి నకిలీ క్రిప్టోకరెన్సీ బ్రోకరేజ్ వెబ్‌సైట్‌తో తమకు ఎలాంటి సంబంధం లేదని, దీని పట్ల పెట్టుబడిదారులు అప్రమత్తంగా ఉండాలని 'బెర్క్‌షైర్ హాత్వే ఇంక్' ఒక ప్రకటనలో పేర్కొంది.

"నకిలీ క్రిప్టోకరెన్సీ వెబ్‌సైట్ 2020లో స్థాపించబడిన టెక్సాస్ ఆధారిత బ్రోకరేజి సంస్థగా పేర్కొంటూ క్రిప్టోకరెన్సీ మైనింగ్‌ పెట్టుబడుల గురించి వివరిస్తుంది. ఇది రెగ్యులేటర్లలో తప్పుడు పేర్లతో ఆపరేటింగ్ చేస్తుందని, అలాగే ఈ వెబ్ చిరునామాను కలిగి ఉన్న ఎంటిటీకి బెర్క్‌షైర్ హాత్వే ఇంక్‌కు ఎటువంటి అనుబంధం లేదు" అని బెర్క్‌షైర్ తెలిపింది. ప్రపంచ పెట్టుబడులలో రారాజుగా ఉన్నటువంటి వారెన్ బఫెట్ 1965లో బెర్క్‌షైర్ హాత్వే ఇంక్‌ని స్థాపించారు. మొదటి నుంచి వారెన్ బఫెట్ క్రిప్టోకరెన్సీ పట్ల అనాసక్తిని కలిగి ఉన్నారు.

Advertisement

Next Story