- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టెలికాం పరికరాల కోసం చైనా కంపెనీకి వొడాఫోన్ ఐడియా ఆర్డర్!
న్యూఢిల్లీ: బ్రాడ్‌బ్యాండ్ నెట్‌వర్క్ పరికరాల కోసం టెలికాం కంపెనీ వొడాఫోన్ ఐడియా చైనా కంపెనీ జెడ్‌టీఈకి రూ. 200 కోట్ల విలువైన నెట్‌వర్క్ గేర్ ఆర్డర్ ఇచ్చినట్టు తెలుస్తోంది. దీని ద్వారా ప్రధాన టెలికాం సర్కిళ్లు అయిన మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్-చత్తీస్‌గఢ్‌లలో బ్రాడ్‌బ్యాండ్ నెట్‌వర్ పరికరాలను జెడ్‌టీఈ కంపెనీ అందించనుంది. 2020లో ఏర్పాటైన జాతీయ భద్రత కోసం ఏర్పాటైన కమిటీ విశ్వసనీయ కంపెనీల నుంచి మాత్రమంఏ టెలికాం పరికరాలను సమకూర్చుకోవాలని నిర్ణయం తీసుకుంది. దేశంలో టెలికాం సేవల్లో వాడే పరికరాలు, వాటిని ఎక్కడి నుంచి కొనాలనే విషయాన్ని ప్రభుత్వమే ప్రకటిస్తుంది. దీన్ని డిప్యూటీ జాతీయ భద్రతా సలహాదారు ఆధ్వర్యంలోని కమిటీ నిర్ణయిస్తుంది. ఈ క్రమంలోనే వొడాఫోన్ ఐడియా తాజాగా జెడ్‌టీఈకి నెట్‌వర్క్ గేర్ ఆర్డర్ ఇచ్చిందని జాతీయ భద్రతా మండలి సెక్రటేరియట్ తెలిపినట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. దీనికి సంబంధించి వొడాఫోన్ ఐడియా అధికారికంగా స్పందించాల్సి ఉంది. కొత్త నిబంధనలు అమలైన తర్వాత 5జీ టెలికాం పరికరాల కోసం చైనా కంపెనీలకు ఆర్డర్లు ఇవ్వకూడదు. అయితే, వొడాఫోన్ ఐడియా జెట్‌టీఈకి ఆర్డర్ ఇవ్వడం చర్చనీయాంసంగా మారింది.
Also Read..