- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
40 లక్షల మంది వినియోగదారులను కోల్పోయిన వొడాఫోన్ ఐడియా!
న్యూఢిల్లీ: ఈ ఏడాది సెప్టెంబర్ నెలకు సంబంధించి వొడాఫోన్ ఐడియా వరుస నెలల్లో వినియోగదారులను కోల్పోయింది. టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ తాజా గణాంకాల ప్రకారం, వొడాఫోన్ ఐడియా సెప్టెంబర్‌లో 40 లక్షల మంది వినియోగదారులను కోల్పోయింది. ప్రధానంగా కొత్త 5జీ నెట్‌వర్క్ కార్యకలాపాలను వేగవంతం చేయడం నెమ్మదించడంతో కంపెనీ సబ్‌స్క్రైబర్లు క్రమంగా తగ్గుతున్నారని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడ్డాయి.
దీంతో సమీక్షించిన నెలలో వొడాఫోన్ ఐడియా మార్కెట్ వాటా 22.03 శాతం నుంచి 21.75 శాతానికి పడిపోయింది. ఇదే సమయంలో టెలికాం దిగ్గజాలు రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్‌లకు భారీ సంఖ్యలో సబ్‌స్క్రైబర్లు పెరిగారు.
సెప్టెంబర్‌లో ఎయిర్‌టెల్‌కు కొత్తగా 4.1 లక్షల మంది వినియోగదారులు చేరడంతో మార్కెట్ వాటా 31.66 శాతం నుంచి 31.08 శాతానికి పెరిగింది. జియో సబ్‌స్క్రైబర్లు 7.2 లక్షల మంది పెరగడంతో వాటా 36.48 శాతం నుంచి 36.66 శాతానికి చేరుకుందని ట్రాయ్ తెలిపింది. మొత్తం దేశంలో మొబైల్ వినియోగదారుల సంఖ్య 3.66 శాతం తగ్గి 114.5 కోట్లకు చేరుకుంది.