అత్యంత బలమైన కరెన్సీల జాబితాలో భారత్‌ ర్యాంకు ఇదే..

by S Gopi |
అత్యంత బలమైన కరెన్సీల జాబితాలో భారత్‌ ర్యాంకు ఇదే..
X



దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ ఫోర్బ్స్ సంస్థ ప్రపంచంలోనే అత్యంత బలమైన కరెన్సీల జాబితాను విడుదల చేసింది. ఇందులో కువైట్‌కు చెందిన కువైటీ దినార్ మొదటిస్థానంలో నిలవగా, బహ్రెయిన్ దినార్ రెండో స్థానంలో ఉంది. భారత కరెన్సీలోకి మారిస్తే ఒక్క కువైటీ దినార్ రూ. 270.23కు సమానం కాగా, బహ్రెయిన్ దినార్ రూ. 220.4కు సమానం. ఈ జాబితాలో భారత కరెన్సీ రూపాయి ఒక డాలరుకు రూ. 83 వద్ద 15వ ర్యాంకు సాధించింది. ఫోర్బ్స్ ప్రకారం తొలి బలమైన 10 కరెన్సీల జాబితాలో మూడో స్థానంలో ఒమన్ రియాల్(భారత కరెన్సీలో విలువ రూ. 215.84), జోర్డాన్ దినార్(రూ. 117.10), జిబ్రాల్టర్ పౌండ్(రూ. 105.52), బ్రిటిష్ పౌండ్(రూ. 105.54), కెమన్ దీవుల డాలర్(రూ. 99.76), స్విస్ ఫ్రాంక్(రూ. 97.84), యూరో(రూ. 90.80), అమెరికా డాలర్(రూ. 83) ఉన్నాయి. ప్రపంచ వాణిజ్యానికి అత్యధికంగా వినియోగించే అమెరికా కరెన్సీ డాలర్ ఈ జాబితాలో పదో స్థానంలో ఉండటం గమనార్హం. 1960 నుంచి కువైటీ దినార్ ప్రపంచంలోనే అత్యంత బలమైన కరెన్సీగా ఉంది. చమురు, పన్ను రహిత వ్యవస్థ కారణంగా ఆ దేశ ఆర్థికవ్యవస్థ స్థిరంగా కొనసాగుతోంది. అలాగే, స్విస్ ఫ్రాంక్ ప్రపంచంలోనే అత్యంత స్థిరమైన కరెన్సీగా నిలిచింది.

Advertisement

Next Story

Most Viewed