- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
క్రెడిట్ సూయిజ్‌ను కాపాడటానికి స్విస్ ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు
స్విట్జర్లాండ్: సంక్షోభంలో కొట్టుమిడాతున్న క్రెడిట్ సూయిజ్‌ను కొనుగోలు చేసేందుకు స్విట్జర్లాండ్ బ్యాంకింగ్ దిగ్గజం UBS గ్రూప్ ఏజీ చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. క్రెడిట్ సూయిజ్ గ్రూప్ మొత్తాన్ని లేదా కొంత భాగాన్ని స్వాధీనం చేసుకోవడానికి చర్చలు జరుపుతోంది. దీనికోసం ఈ వారాంతంలో స్విస్ నేషనల్ బ్యాంక్ అక్కడి నియంత్రణ సంస్థ ఫిన్మాతో రెండు బ్యాంకులు విడివిడిగా చర్చలు జరిపి ఒక కీలక ఒప్పందం చేసుకోనున్నాయి.
క్రెడిట్ సూయిస్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ దీక్షిత్ జోషి, ఇతర బృందాలు వారాంతంలో సమావేశాలు నిర్వహించి బ్యాంక్ వ్యూహాత్మక పరిస్థితులను అంచనా వేస్తారని సమాచారం. రెండు బ్యాంకుల మధ్య అనేక ఇతర అంశాలు కూడా చర్చలోకి రానున్నాయి. ఆర్థిక సంక్షోభంలో ఉన్న క్రెడిట్ సూయిజ్‌ను ఎలాగైన గట్టేక్కించాలని స్విస్ బ్యాంకు, అక్కడి ప్రభుత్వం, నియంత్రణ సంస్థ ఫిన్మా పలు ప్రయత్నాలు చేస్తున్నాయి.
ఈ ఒప్పందం కుదుర్చడం ద్వారా బ్యాంకును నష్టాల నుంచి బయటపడేయవచ్చని భావిస్తున్నాయి. పెట్టుబడిదారుల విశ్వాసాన్ని పునరుద్ధరించడం లో ఇది చాలా కీలకం కానుందని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. లిక్విడిటీని పెంచడానికి స్విస్ కేంద్ర బ్యాంకు నుంచి క్రెయిడ్ సూయిజ్ బ్యాంకు రూ. 4.43 లక్షల కోట్ల రుణాన్ని పొందుతున్నట్లు పేర్కొంది. దీంతో తమ ఆర్థిక మూలాలు బలోపేతం అవుతాయని బ్యాంకు తెలిపింది.
Read more:
రైతులకు గుడ్‌న్యూస్: మరో విడత PM-KISAN రూ.2 వేలు అకౌంట్లోకి వచ్చేది ఎప్పుడంటే!