ఆన్‌లైన్ స్కామ్‌ల నుంచి రక్షించడానికి ఇన్సూరెన్స్‌ను తెచ్చిన ట్రూకాలర్

by Harish |   ( Updated:2024-06-28 14:19:26.0  )
ఆన్‌లైన్ స్కామ్‌ల నుంచి రక్షించడానికి ఇన్సూరెన్స్‌ను తెచ్చిన ట్రూకాలర్
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ కాలర్ ఐడీ సంస్థ ట్రూకాలర్ కొత్తగా ఒక ఫీచర్‌ను తీసుకొచ్చింది. వినియోగదారులను ఆన్‌లైన్ స్కామ్‌ల నుంచి రక్షించడానికి ఇన్సూరెన్స్‌ను అందుబాటులోకి తెచ్చింది. దీనిని ‘ట్రూకాలర్ ఫ్రాడ్ ఇన్సూరెన్స్‌’ పేరుతో పిలుస్తారు. ఈ కొత్త పాలసీని తీసుకున్న వారు, ఆన్‌లైన్‌లో మోసపోయినట్లయితే వారికి రూ.10,000 వరకు కవరేజ్ లభిస్తుంది. అయితే ఇది ప్రస్తుతం ట్రూకాలర్ వార్షిక ప్రీమియం సబ్‌స్క్రైబర్‌లకు మాత్రమే అందుబాటులో ఉంది. ఈ పాలసీని ఆండ్రాయిడ్, iOS రెండింటిలోనూ ట్రూకాలర్ యాప్‌లో పొందవచ్చు. మొదట ఇది ఇండియాలో మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలో మిగతా దేశాల్లో వినియోగదారులకు లభిస్తుంది.

భారతీయ యూజర్లకు ఆన్‌‌లైన్ మోసాల నుంచి రక్షణ కల్పించడానికి HDFC ఎర్గోతో కలిసి ఈ పాలసీని తీసుకొచ్చినట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. దీనిని నేరుగా ట్రూకాలర్ యాప్‌లో పొందవచ్చు. వినియోగదారులు పాలసీని యాక్టివేట్ చేసుకున్న తరువాత ఆన్‌లైన్‌లో మోసపోయినట్లయితే వారికి కవరేజ్ కింద రూ.10,000 లభిస్తాయని అధికారులు తెలిపారు. ప్రీమియం సబ్‌స్క్రైబర్‌లను డిజిటల్ మోసాల నుంచి రక్షించడానికి ఇది బాగా ఉపయోగపడుతుందని వారు పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed