- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
రేపే భారత్-EFTA వాణిజ్య ఒప్పందంపై సంతకాలు
దిశ, బిజినెస్ బ్యూరో: భారత్-ఈఎఫ్‌టీఏ(EFTA-యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్) స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై ఇరుపక్షాలు ఆదివారం సంతకాలు చేయనున్నాయి. ఈ ఒప్పందంలో భాగంగా ఐస్‌లాండ్, లీచ్‌టెన్‌స్టెయిన్, నార్వే, స్విట్జర్లాండ్‌లతో కూడిన నాలుగు-దేశాలు భారత్‌లో తమ కంపెనీల ద్వారా 15 ఏళ్లలో 100 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టనున్నాయి. దీని ద్వారా దాదాపు 10 లక్షల ఉద్యోగాలు వస్తాయని అధికారులు తెలిపారు. అలాగే, ఈ డీల్ ద్వారా నాలుగు దేశాల కూటమికి భారతదేశపు జంతు ఉత్పత్తులు, చేపలు, ప్రాసెస్ చేసిన ఆహారం, కూరగాయల నూనెలకు పన్ను లేకుండా యాక్సెస్ ఉంటుంది.
మొదటగా ఈ వాణిజ్య ఒప్పందం పై 2008లో ఇరు పక్షాల మధ్య చర్చలు ప్రారంభించాయి. ఆ తర్వాత 2013లో చర్చలు నిలిపివేశారు. మళ్లీ 2016 లో చర్చలు ప్రారంభం కాగా కొన్ని చర్చల తరువాత చివరకు 2023లో మళ్లీ జరిగాయి. మొత్తం నాలుగు EFTA దేశాలలో, స్విట్జర్లాండ్ భారత్‌కు అతిపెద్ద వ్యాపార భాగస్వామి. గత ఆర్థిక సంవత్సరంలో, EFTA దేశాలతో భారతదేశం వాణిజ్య లోటు 14.8 బిలియన్ డాలర్లుగా ఉంది.