భారత్‌లో ఈవీ తయారీ ప్లాంట్ కోసం చేతులు కలపనున్న టెస్లా, రిలయన్స్

by S Gopi |
భారత్‌లో ఈవీ తయారీ ప్లాంట్ కోసం చేతులు కలపనున్న టెస్లా, రిలయన్స్
X

దిశ, బిజినెస్ బ్యూరో: గ్లోబల్ ఈవీ బ్రాండ్ టెస్లా భారత మార్కెట్లో ప్రవేశించేందుకు సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్‌లో కార్యకలాపాల కోసం స్థానిక భాగస్వామిని వెతికే పనిలో ఉన్నట్టు సమాచారం. దేశీయ అతిపెద్ద రిలయన్స్ ఇండస్ట్రీస్‌తో కలిసి దేశంలో తయారీ ప్లాంటును నిర్మించేందుకు అవకాశాలను అన్వేశిస్తున్నట్టు ఇటీవల కథనాలు వెలువడ్డాయి. హిందూ బిజినెస్‌లైన్ నివేదిక ప్రకారం, టెస్లా భారత మార్కెట్ కోసం 2 బిలియన్ డాలర్ల పెట్టుబడులను కేటాయించింది. ప్లాంటు ఏర్పాటు కోసం గుజరాత్, మహారాష్ట్ర సహా వివిధ ప్రాంతాలను పరిశీలిస్తోంది. ముఖ్యంగా మహారాష్ట్రను ఎంచుకునేందుకు సిద్ధంగా ఉన్నట్టు నివేదిక అభిప్రాయపడింది. వచ్చే నెలలోగా టెస్లా సీనియర్ అధికారులు భారత్‌ను సందర్శించి ప్లాంటు ఏర్పాటు చేసేందుకు ప్రదేశాన్ని ఖరారు చేయనున్నారు. అలాగే, రిలయన్స్‌తో జాయింట్ వెంచర్ కోసం ప్రయత్నించవచ్చు. అయితే, రిలయన్స్‌తో చర్చలు సాధ్యం కాకపోతే మరో భారత కంపెనీతో చర్చల కోసం ప్రయత్నించవచ్చని తెలుస్తోంది.

Advertisement

Next Story