- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Tax: పన్ను స్లాబ్‌లో మార్పుల వల్ల మధ్యతరగతి వారికి రూ.17,500 ఆదా: CBDT చైర్మన్
దిశ, బిజినెస్ బ్యూరో: మంగళవారం ప్రవేశపెట్టిన కేంద్రబడ్జెట్‌లో పన్ను స్లాబ్‌ల్లో మార్పులు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దీనిపై సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) చైర్మన్ రవి అగర్వాల్ మాట్లాడుతూ, ఈ మార్పుల వలన మధ్యతరగతి ప్రజలకు దాదాపు రూ.17,500 ఆదా అవుతుందని అన్నారు. ప్రభుత్వం సరైన విధానాన్ని అవలంబించింది, ఇది 65 శాతం మందికి ప్రయోజనం చేకూరుస్తుందని ఆయన చెప్పారు. పాత పన్ను విధానంలో ఎక్కువ రేట్లు ఉన్నాయి. కొత్త దానిలో తక్కువ పన్ను స్లాబ్‌ల పరిధిని రూ.3-7 లక్షలు, రూ.7-10 లక్షలకు పెంచారు. ఇది పన్ను చెల్లింపుదారులందరికీ ప్రయోజనం చేకూరుస్తుందని రవి అగర్వాల్ ఒక సమావేశంలో అన్నారు.
అలాగే, వేతన జీవులకు స్టాండర్డ్ డిడక్షన్ కూడా రూ.50,000 నుంచి రూ.75,000కి పెంచారు. దీంతో ప్రత్యక్ష పన్నుల రూపంలో ప్రభుత్వం రూ.29,000 కోట్ల ఆదాయాన్ని వదులుకోవాల్సి వచ్చిందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుత బడ్జెట్‌లో కొత్త పన్ను విధానంలో పన్ను స్లాబ్‌ల్లో మార్పులు చేయగా, పాత పన్ను విధానం రేట్లను మాత్రం ముట్టుకోలేదు. బడ్జెట్ సమావేశం అనంతరం మాట్లాడిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పాత పన్ను విధానాన్ని దశల వారీగా రద్దు చేసే ఆలోచన ప్రస్తుతం లేదని స్పష్టం చేశారు.