- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రూ.11 వేల కోట్ల విలువైన కాంట్రాక్టులను అందించిన టాటా పవర్
దిశ, బిజినెస్ బ్యూరో: టాటా పవర్ నేతృత్వంలోని ఒడిశా డిస్కమ్‌లు స్థానిక కాంట్రాక్టర్లు, సరఫరాదారులకు రూ.11,481 కోట్ల విలువైన కాంట్రాక్టులను అప్పగించినట్లు అధికారి తెలిపారు. మీటర్ రీడింగ్, బిల్లింగ్, నెట్‌వర్క్ మెయింటెనెన్స్, వంటి వాటిని స్థానికులకు అప్పగించారు. దీని ద్వారా పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న నివాసితులకు ఉపాధి దొరికింది. టాటా పవర్-ఒడిశా ప్రభుత్వం మధ్య జాయింట్ వెంచర్‌ల ద్వారా విద్యుత్ పంపిణీ కార్యకలాపాల కోసం గత మూడు సంవత్సరాల్లో డిస్కమ్‌ల ద్వారా స్థానిక MSMEలకు రూ. 8,690 కోట్లు, ఇతర సంస్థలకు రూ.2,791 కోట్ల విలువైన ఆర్డర్‌లు అందినట్లు అధికారి పేర్కొన్నారు.
ఒడిశా డిస్కమ్‌లు - టిపీ సెంట్రల్, టిపీ సదరన్, టిపీ నార్తర్న్, టిపీ వెస్ట్రన్ ఒడిశా డిస్ట్రిబ్యూషన్ లిమిటెడ్ 6,645 స్థానిక విక్రేతలు, సరఫరాదారులతో ఒప్పందాలను కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందాలు రోజువారీ కార్యకలాపాలు, సేవలకు వెన్నెముకగా పనిచేస్తాయి. సర్వీస్ సెక్టార్‌లో, మీటర్ రీడింగ్, బిల్లింగ్, వంటి వాటిని కవర్ చేస్తూ, డిస్కమ్‌లు మొత్తం 7,560 కోట్ల రూపాయలతో 4,347 మంది విక్రేతలకు కాంట్రాక్టులు ఇచ్చాయి. అదేవిధంగా, డిస్కమ్‌లు డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్లు, కేబుల్స్, పోల్స్, ఇతర వాటితో సహా మెటీరియల్స్ సప్లై కేటగిరీలో కార్యకలాపాల కోసం రూ.3,921 కోట్ల విలువైన 2,298 కాంట్రాక్టులను కేటాయించింది. ఇది మేక్ ఇన్ ఒడిశా విజన్‌తో పాటు ఒడిశా ఆర్థిక పురోగతిని నడపడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇది వ్యాపార రంగాన్ని మార్చివేసింది, స్థానిక కమ్యూనిటీల ఆర్థిక శ్రేయస్సుకు గణనీయంగా దోహదపడిందని టాటా పవర్ తెలిపింది.