- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆడ పిల్లల భవిష్యత్తుకు Sukanya Samriddhi Yojana.. రూ. 250 లతో 5 లక్షల రూపాయలు
దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర ప్రభుత్వం 2015 జనవరిలో ఆడ పిల్లల కోసం సుకన్య సమృద్ధి యోజన అనే పథకాన్ని తీసుకొచ్చింది.ఇది ఆడ పిల్లల భవిష్యత్తు విద్య, వివాహ ఖర్చుల కోసం భవిష్యత్తు అవసరాల కోసం తల్లిదండ్రులు కొంత అమౌంట్‌ను సేవింగ్ చేయడానికి ఉపయోగపడుతుంది. దీనిని ఏ బ్యాంకులలో అయిన, పోస్ట్ ఆఫీస్ కార్యాలయంలో అయిన ఓపెన్ చేయవచ్చు. ఈ ఖాతాను 10 ఏళ్ళు నిండకముందే తెరవచ్చు. రెండు ఖాతాలను తెరిచే అవకాశం ఉంది. అలాగే, ఖాతాను భారతదేశంలో ఎక్కడికైన ట్రాన్స్‌ఫర్ చేయవచ్చు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి, సుకన్య సమృద్ధి ఖాతా 7.6% వడ్డీ రేటును ఇస్తుంది. కనీసం రూ. 1000, గరిష్టంగా రూ. 1.5 లక్షల పెట్టుబడి పెట్టవచ్చు. 1961 ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C ప్రకారం, సుకన్య సమృద్ధి యోజన పథకం ద్వారా చేసిన పెట్టుబడులకు మినహాయింపు ఉంటుంది. 18 సంవత్సరాల వయస్సులో అవసరం నిమిత్తం ఖాతాలో 50% డబ్బులను విత్‌డ్రా చేసుకోవచ్చు. కనీస మొత్తం నిర్వహించకపోతే ఖాతా డిఫాల్ట్‌గా పరిగణించబడుతుంది.
రూ. 250 లతో ఖాతాను ఓపెన్ చేయవచ్చు. ప్రతినెల 1,000 రూపాయలు డిపాజిట్ చేస్తే, మొత్తం వార్షిక డిపాజిట్ 12,000 రూపాయలు అవుతుంది. కూతురు పుట్టగానే ఖాతా తెరిస్తే రూ. ఆమెకు 21 ఏళ్లు వచ్చే నాటికి మెచ్యూరిటీ సమయంలో రూ. 5,27,445 పొందవచ్చు.
Read more:
New Year లో మంచి రాబడి కోసం ఈ పథకాల్లో Investments పెట్టండి!