Stock Markets: నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్

by Maddikunta Saikiran |
Stock Markets: నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ స్టాక్ మార్కెట్లు(Stock Markets) బుధవారం నష్టాల్లో ముగిశాయి. ఈ రోజు ఉదయం లాభాల్లో ప్రారంభమైన సూచీలు మధ్యాహ్నం తర్వాత మళ్లీ నష్టాల్లో కొనసాగాయి. సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో ప్రధాన కంపెనీలు ఆశించినంత మేర రాణించకపోవడం, మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్త పరిస్థితితులు వంటివి స్టాక్ మార్కెట్ నష్టాలకు కారణంగా తెలుస్తోంది. ముఖ్యంగా ఈ రోజు హెచ్‌డీ‌ఎఫ్‌సీ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్ షేర్లు రాణించాయి. కానీ ఐసీఐసీఐ బ్యాంక్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఎల్&టీ షేర్లు అమ్మకాల ఒత్తిడితో మార్కెట్ నష్టాలను చవిచూసింది. సెన్సెక్స్‌(Sensex) ఉదయం 80,220.72 పాయింట్ల వద్ద ప్రారంభమై ఇంట్రాడేలో 80,646.31 పాయింట్ల వద్ద గరిష్టాన్ని తాకింది. తాకింది. చివరికి 138.74 పాయింట్లు నష్టపోయి 80,081.99 వద్ద స్థిరపడింది. ఇక నిఫ్టీ(Nifty) కూడా 36.60 పాయింట్ల నష్టంతో 24,435 వద్ద ముగిసింది. గ్లోబల్ మార్కెట్లో బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 75.14 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. అమెరికా డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 84.08గా ఉంది.

లాభాలో ముగిసిన షేర్లు : టెక్ మహీంద్రా, టీసీఎస్, బజాజ్ ఫైనాన్స్, హెచ్‌డీ‌ఎఫ్‌సీ బ్యాంక్, హెచ్​సీఎల్ టెక్నాలజీస్

నష్టపోయిన షేర్లు : మహీంద్రా అండ్ మహీంద్రా, ఎల్&టీ, అదానీ పోర్ట్స్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్


Advertisement

Next Story

Most Viewed