- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఎట్టకేలకు లాభాల్లోకి మారిన మార్కెట్లు!
ముంబై: దేశీయ ఈక్విటీ మార్కెట్లలో వరుస ఐదు రోజుల నష్టాలకు బ్రేక్ పడింది. గురువారం ప్రతికూలంగా మొదలైన ర్యాలీ మిడ్-సెషన్ ముందు వరకు తీవ్ర అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నది. ముఖ్యంగా అంతర్జాతీయ మార్కెట్లో క్రెడిట్ సూయిస్ షేర్ల పతనం కారణంగా మదుపర్ల సెంటిమెంట్ బలహీనపడటంతో ఉదయం కొద్దిసేపు సూచీలు ఒడిదుడుకులను ఎదుర్కొన్నాయి. ఆ తర్వాత గ్లోబల్ మార్కెట్ల నుంచి ఒత్తిడి ఉన్నప్పటికీ క్రెడిట్ సూయిస్ సంస్థ సెంట్రల్ బ్యాంకు నుంచి నిధులను సమకూర్చుకుంటామని ప్రకటించడంతో తిరిగి మార్కెట్లలో ర్యాలీ మొదలైంది. దీనికితోడు యూరప్ మార్కెట్లలో మునుపటి పతనం నుంచి కోలుకోవడం, ముడి చమురు ధరలు ఏడాది కంటే ఎక్కువ కనిష్ఠానికి దిగిరావడం, దేశీయంగా కనిష్టాల వద్ద కొనుగోళ్ల మద్దతుతో లాభాలు పుంజుకున్నాయి.
దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 78.94 పాయింట్లు లాభపడి 57,634 వద్ద, నిఫ్టీ 13.45 పాయింట్లు పెరిగి 16,985 వద్ద ముగిశాయి. నిఫ్టీలో మెటల్ రంగం దాదాపు 3 శాతం పతనమవగా, మీడియా, బ్యాంకింగ్ రంగాలు బలపడ్డాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో నెస్లే ఇండియా, ఏషియన్ పెయింట్, హిందూస్తాన్ యూనిలీవర్, టైటాన్, సన్‌ఫార్మా, పవర్‌గ్రిడ్, ఎస్‌బీఐ, బజాజ్ ఫిన్‌సర్వ్, యాక్సిస్ బ్యాంక్, టాటా మోటార్స్ కంపెనీల షేర్లు లాభపడ్డాయి. టాటా స్టీల్, ఇండస్ఇండ్ బ్యాంక్, భారతీ ఎయిర్‌టెల్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సీఎల్ టెక్ స్టాక్స్ నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 82.78 వద్ద ఉంది.
Also Read..