SpiceJet: సిబ్బందికి జీతం కట్ చేస్తూ స్పైస్‌జెట్ నిర్ణయం

by S Gopi |
SpiceJet: సిబ్బందికి జీతం కట్ చేస్తూ స్పైస్‌జెట్ నిర్ణయం
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ ప్రముఖ విమానయాన సంస్థ స్పైస్‌జెట్ కీలక నిర్ణయం తీసుకుంది. గత ఆరేళ్లుగా ఆర్థిక నష్టాలతో సతమతమవుతున్న సంస్థ తక్కువ ట్రావెల్ సీజన్ కారణంగా 150 మంది క్యాబిన్ సిబ్బందిని మూడు నెలల పాటు తాత్కాలికంగా సెలవుపై పంపుతున్నట్టు ప్రకటించింది. సెలవుపై ఉన్న సమయంలో వారికి ఎలాంటి జీతం ఉండదని స్పష్టం చేసింది. తప్పనిసరి పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకున్నామని, ప్రయాణికుల డిమాండ్, విమానాల సంఖ్య కూడా తగ్గడంతో సంస్థ నిర్వహణను పరిగణలోకి తీసుకుని చర్యలు తీసుకున్నట్టు స్పైస్‌జెట్ పేర్కొంది. సెలవుపై ఉండబోయే వారిని సంస్థ ఉద్యోగులుగానే పరిగణిస్తామని, వారి ఎర్న్‌డ్ లీవ్, ఆరోగ్య సంబంధిత ప్రయోజనాలు కొనసాగుతాయని స్పష్టం చేసింది. కాగా, అప్పుల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న స్పైస్‌జెట్ ప్రస్తుతానికి కేవలం 22 విమానాలతో మాత్రమే సేవలందిస్తోంది.

Advertisement

Next Story