ప్రపంచ కుబేరుడైన అదానీని గజగజ వణికిస్తున్న అంబులెన్స్ డ్రైవర్..

by S Gopi |   ( Updated:2023-02-04 08:21:29.0  )
ప్రపంచ కుబేరుడైన అదానీని గజగజ వణికిస్తున్న అంబులెన్స్ డ్రైవర్..
X

దిశ, వెబ్ డెస్క్: ఆయన ప్రపంచ కుబేరుడు... ఆసియాలోనే రిచెస్ట్ పర్సన్ అదానీ అంటూ ప్రకటనలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే, కాదు కాదు అతనిది సక్రమ సంపాదన కాదు అంతా అక్రమ సంపాదనే అంటూ ఓ రిపోర్ట్ బయటకొచ్చిన విషయం తెలిసిందే. ఓ సంస్థ రెండేళ్లపాటు రీసెర్చ్ చేసి అదానీ అక్రమ ఆస్తులకు సంబంధించి రిపోర్ట్ ను బయటపెట్టింది. దీంతో అదానీ షేర్లు భారీగా పడిపోయాయి. దీంతో ఇప్పుడా ఆ సంస్థ, ఆ సంస్థను స్థాపించిన వ్యక్తి పేరు ప్రపంచ వ్యాప్తంగా వినబడుతోంది. అతని పేరేమిటి..? ఆయనదెక్కడా...? ఎలా అదానీ అక్రమ ఆస్తులపైన రీసెర్చ్ చేశాడు..? అనే వివరాలు ఇంటర్నెట్ లో జనం సెర్చ్ చేస్తున్నారంటా. సో.. ఇప్పుడు ఆ సంస్థ గురించి, అతని గురించిన పూర్తి వివరాలు ఈ కథనంలో...

అదానీ గత 30 ఏళ్లుగా అనేక దేశాల్లో మనీ లాండరింగ్ కు పాల్పడుతూ సెల్ కంపెనీలను సృష్టించి తప్పుడు డాక్యుమెంట్లతో తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరిస్తూ వచ్చాడంటూ హిడెన్ బర్గ్ రీసెర్చ్ వివరాలతో సహా బయటపెట్టింది. దీంతో ఒక్కసారిగా అదానీ షేర్స్ భారీగా పడిపోయాయి. భారీగా నష్టం వాటిళ్లింది. దీంతో హిడెన్ బర్గ్ రిపోర్ట్ పేరు ప్రపంచ వ్యాప్తంగా వినబడుతోంది. అంతేకాదు.. తప్పుడు పత్రాలు సృష్టించి ఇన్వెస్టర్లను మోసం చేసి షేర్ విలువను పెంచుకునే లిస్టెడ్ కంపెనీలకు హిడెన్ బర్గ్ రిపోర్ట్ అనేది ఒక డెత్ వారెంట్ లాగా మారింది. అమెరికాలోని న్యూయార్క్ కు చెందిన నాదన్ అండెర్ సన్ అనే 37 ఏళ్ల వ్యక్తి హిడెన్ బర్గ్ ను స్టార్ట్ చేశాడు. స్టాక్ మార్కెట్లో జరిగే మోసాలను బయటపెట్టి ఇన్వెస్టర్లను కాపాడడమే ఈ హిడెన్ బర్గ్ లక్ష్యం. నికోలా, క్లోవర్ హెల్త్, కండి, లార్డ్ స్టాన్ మోటార్స్, టెక్నో గ్లాస్ కంపెనీల మోసాలను కూడా బయటపెట్టి ఇన్వెస్టర్లను కాపాడింది ఈ హిడెన్ బర్గ్. అదానీ గ్రూప్ పైన కూడా ఈ హిడెన్ బర్గ్ రీసెర్చ్ చేసింది. మొత్తం రెండేళ్లపాటు రీసెర్చ్ ఆధారాలతో సహా మొత్తం 106 పేజీల రిపోర్ట్ ను జనవరి 24న బయటపెట్టింది. దీంతో అదానీ గ్రూప్ షేర్ల పడిపోతూ వచ్చాయి. కేవలం 3 రోజుల్లోనే అదానీ గ్రూప్ షేర్లు రూ. 5 లక్షల కోట్లు నష్టపోయాయి. దీంతో హిడెన్ బర్గ్ పేరు, దానిని స్థాపించిన నాదన్ పేరు కూడా ప్రపంచ వ్యాప్తంగా వినబడుతోంది.

మరో విషయమేమంటే.. నాదన్ అండెర్ సన్ కనెక్టికట్ యూనివర్సిటీ నుండి ఇంటర్నేషనల్ బిజినెస్ లో చదివాడు. ఫాక్ట్ సెట్ రీసెర్చ్ సంస్థలో అండెర్ పని చేశాడు. విచిత్రం ఏమంటే.. నాదన్ అండెర్ సన్ అంబులెన్స్ డ్రైవర్ గా కూడా పని చేశాడంటా.

ఇవి కూడా చదవండి : ప్రస్తుత సవాళ్లు సూపర్ పవర్ కావాలనే భారత్ లక్ష్యాన్ని ప్రభావితం చేయలేవు: ఆనంద్ మహీంద్రా

Advertisement

Next Story

Most Viewed