- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
భారత్‌లో 2030 నాటికి 600 కిలోటన్నులకు చేరనున్న సోలార్ వ్యర్థాలు
దిశ, బిజినెస్ బ్యూరో: ప్రస్తుతం భారత్ పునరుత్పాదక విద్యుత్ ఉత్పతిపై ఎక్కువగా దృష్టి పెట్టింది. దీనికోసం దేశంలో చాలా చోట్ల సోలార్ ప్రాజెక్ట్‌లను ఏర్పాటు చేస్తుంది. ఈ నేపథ్యంలో సోలార్ వ్యర్థాలు కూడా భారీగా పేరుకుపోతున్నాయి. ఇటీవల CEEW అధ్యయనం ప్రకారం, 2030 నాటికి భారతదేశంలోని సౌర వ్యర్థాలు 600 కిలోటన్నులకు చేరుకోవచ్చని, ఇవి 720 ఒలింపిక్ సైజు స్విమ్మింగ్ పూల్‌లను నింపడానికి సమానమని బుధవారం విడుదల చేసిన నివేదికలో పేర్కొంది.
ముఖ్యంగా ఈ వ్యర్థాలలో రాజస్థాన్, గుజరాత్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు నుంచి 67 శాతం వస్తుంది. ప్రస్తుతం భారత్‌లో 66.7 GW సామర్థ్యం కలిగిన ప్రాజెక్ట్‌లు ఇప్పటికే దాదాపు 100 కిలోటన్నుల వ్యర్థాలను ఉత్పత్తి చేయగా, ఇది 2030 నాటికి 340 కిలోటన్నులకు పెరుగుతుందని నివేదిక అభిప్రాయ పడింది. దీనిలో 10 కిలోల సిలికాన్, 12-18 టన్నుల వెండి, 16 టన్నుల కాడ్మియం ఉంటాయని తెలిపింది. సోలార్ వ్యర్థాలను రీసైక్లింగ్ చేయడం తగ్గితే 2050 నాటికి సౌర వ్యర్థాలు దాదాపు 19,000 కిలోటన్నులకు పెరిగే అవకాశం ఉందని నివేదిక అంచనా వేసింది.
2030 నాటికి భారతదేశం 292 గిగావాట్ల సౌర సామర్థ్యాన్ని సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నేపథ్యంలో సోలార్ PV వ్యర్థాల నిర్వహణ కీలకమైనదని CEEW పేర్కొంది. వ్యర్థాలను అరికట్టేందుకు భారత్ ఇప్పటికే అనేక చర్యలు తీసుకుంటోంది. గతంలో ఈ-వేస్ట్ మేనేజ్‌మెంట్ రూల్స్ 2022ని జారీ చేసింది. సోలార్ వ్యర్థాలను అరికట్టడం ద్వారా పునరుత్పాదక పర్యావరణ వ్యవస్థ మరింత అభివృద్ధి చెందుతుందని అధ్యయనం పేర్కొంటుంది.