స్టాక్ మార్కెట్లలో కొనసాగుతున్న లాభాలు

by S Gopi |
స్టాక్ మార్కెట్లలో కొనసాగుతున్న లాభాలు
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ ఈక్విటీ మార్కెట్లు వరుస లాభాలను కొనసాగిస్తున్నాయి. అంతకుముందు రెండు సెషన్‌లలో గరిష్ఠాలకు ర్యాలీ చేసిన సూచీలు బుధవారం కొంత ఒడిదుడుకులను ఎదుర్కొన్నప్పటికీ లాభాలను కొనసాగించాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు, అమెరికా ఫెడ్ సమావేశం నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉండటం వంటి పరిణామాల ఒత్తిడి ఉన్నప్పటికీ మార్కెట్లలో కొనుగోళ్లు జరిగాయి. వీటికి తోడు దేశీయ దిగ్గజ కంపెనీల షేర్ల ర్యాలీకి దోహదపడ్డాయి. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 149.98 పాయింట్లు లాభపడి 76,606 వద్ద, నిఫ్టీ 58.10 పాయింట్ల లాభంతో 23,322 వద్ద ముగిశాయి. నిఫ్టీలో పీఎస్‌యూ బ్యాంక్, మీడియా, ఫైనాన్స్ రంగాలు రాణించాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో పవర్‌గ్రిడ్, టెక్ మహీంద్రా, బజాజ్ ఫైనాన్స్, ఆల్ట్రా సిమెంట్, ఎన్‌టీపీసీ, ఎల్అండ్‌టీ, భారతీ ఎయిర్‌టెల్, బజాజ్ ఫిన్‌సర్వ్ కంపెనీల షేర్లు లాభాలను సాధించాయి. ఎంఅండ్ఎం, హిందూస్తాన్ యూనిలీవర్, టైటాన్, ఇన్ఫోసిస్, యాక్సిస్ బ్యాంక్, ఐటీసీ స్టాక్స్ నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 83.55 వద్ద ఉంది.

Advertisement

Next Story

Most Viewed