- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Stock Market: లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ ఈక్విటీ మార్కెట్లు లాభాలను సాధించాయి. అంతకుముందు వరుస సెషన్లలో అమ్మకాల ఒత్తిడి, ఇతర కారణాలతో బలహీనపడిన సూచీలు, గురువారం ట్రేడింగ్‌లో రాణించాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మద్దతు, రానున్న రోజుల్లో యూఎస్ ఫెడరల్ రిజర్వ్ మళ్లీ రేట్లను తగ్గించవచ్చనే అంచనాలు, ఆaసియా మార్కెట్ల ర్యాలీ, దేశీయంగా కీలక బ్లూచిప్ స్టాక్స్‌లో కొనుగోళ్లు మదుపర్ల సెంటిమెంట్‌ను పెంచాయి. అయితే, మిడ్-సెషన్ తర్వాత ఐటీ, ఫార్మా రంగాల్లో లాభాల స్వీకరణ వల్ల లాభాలు తగ్గాయి. బ్యాంకింగ్ రంగ షేర్లలో కొనుగోళ్లతో లాభాలు వచ్చాయి. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 144.31 పాయింట్లు లాభపడి 81,611 వద్ద, నిఫ్టీ 16.50 పాయింట్ల లాభంతో 24,998 వద్ద ముగిశాయి. నిఫ్టీలో ఐటీ, ఫార్మా, హెల్త్‌కేర్ రంగాలు 1 శాతానికి పైగా నీరసించాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో కోటక్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, మారుతీ సుజుకి, పవర్‌గ్రిడ్, ఎంఅండ్ఎం, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, యాక్సిస్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్ షేర్లు లాభాలను సాధించాయి. టెక్ మహీంద్రా, సన్‌ఫార్మా, ఇన్ఫోసిస్, టైటాన్, టాటా మోటార్స్, ఎల్అండ్‌టీ, ఏషియన్ పెయింట్ స్టాక్స్ నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 83.95 వద్ద ఉంది.