layoff: శామ్‌సంగ్ ఇండియాలో లేఆఫ్.. 200 మంది ఎగ్జిక్యూటివ్‌లు ఔట్

by Harish |
layoff: శామ్‌సంగ్ ఇండియాలో లేఆఫ్.. 200 మంది ఎగ్జిక్యూటివ్‌లు ఔట్
X

దిశ, బిజినెస్ బ్యూరో: దక్షిణ కొరియా దిగ్గజం శామ్‌సంగ్ తన ఉద్యోగులను తొలగించడానికి సిద్ధమైంది. ఎలక్ట్రానిక్స్ వ్యాపార వృద్ధి మందగించడం, వినియోగదారుల డిమాండ్ తగ్గడం వల్ల భారతదేశంలో 200 మందికి పైగా ఎగ్జిక్యూటివ్‌లను తొలగించనుంది. శామ్‌సంగ్ ఇటీవల మార్కెట్లో ఉన్న పోటీ కారణంగా తీవ్ర ఒత్తిడికి లోనవుతుంది. స్మార్ట్‌ఫోన్‌ల అమ్మకాలు సైతం తగ్గిపోయాయి. దీంతో ఇండియాలో మార్కెట్ వాటా క్రమంగా క్షీణిస్తుంది. ఈ నేపథ్యంలో ఖర్చులను తగ్గించుకుని లాభాలను పెంచుకోవడానికి ఈ లేఆఫ్ నిర్ణయానికి వచ్చింది. మొబైల్ ఫోన్‌లు, కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాలు, ఇతర సపోర్ట్ విభాగాల్లో లే-ఆఫ్‌లు జరుగుతాయి. మొత్తం 2,000 కు మందికిపైగా ఉన్న ఎగ్జిక్యూటివ్‌లలో 9-10% మందిపై ఈ ప్రభావం పడనుంది. తొలగించబడిన వారికి ఒప్పందం ప్రకారం మూడు నెలల జీతం, ఇతర ప్యాకేజీని అందించనున్నారు.

ఇటీవల వరుసగా మార్కెట్ వాటా తగ్గుతుండటంతో కంపెనీ కొత్త నియామకాలను సైతం నిలిపివేసింది. కీలకమైన పండుగ సీజన్‌కు ముందు చెన్నై ఫ్యాక్టరీలోని కార్మికులు నిరవధిక సమ్మె చేస్తుండంతో టెలివిజన్‌లు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్‌ల ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం పడుతున్న తరుణంలో కంపెనీ ఈ లేఆఫ్ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. త్వరలో టెలివిజన్, గృహోపకరణాలు వంటి కొన్ని వ్యాపార విభాగాలను విలీనం చేసే అవకాశం ఉందని సమాచారం. ఒకవేళ ఇదే జరిగితే మ్యాన్‌పవర్‌ను తగ్గించుకోడానికి మరింత మందిని తొలగించవచ్చు.

Advertisement

Next Story

Most Viewed