- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
గ్రామీణ మార్కెట్లో SUVలకు మంచి ఆదరణ: హ్యుందాయ్ ఇండియా
దిశ, బిజినెస్ బ్యూరో: భారతదేశంలో గ్రామీణ మార్కెట్లో ప్రజలు కార్ల కొనుగోలుకు ఆసక్తి కనబరుస్తున్నారు.ముఖ్యంగా మధ్యతరహా, పెద్ద స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్స్ (SUV)కు గ్రామీణ ప్రాంతాల్లో మంచి ఆదరణ లభిస్తుందని హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ (HMIL) చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (COO) తరుణ్ గార్గ్ అన్నారు. ఈ మార్కెట్లో SUV అమ్మకాలు ఎక్కువగా నమోదవుతున్నాయి. క్రెటా వంటి కొన్ని మోడల్‌లు గణనీయమైన ప్రజాదరణను పొందుతున్నాయి. కొత్త అధునాతన ఫీచర్లతో వచ్చే ఎస్‌యూవీల పట్ల గ్రామీణ కస్టమర్ల ప్రాధాన్యతలు క్రమంగా మారుతున్నాయని గార్గ్ పేర్కొన్నారు.
SUV విభాగంలో తీవ్రమైన పోటీ ఉన్నప్పటికీ, హ్యుందాయ్ క్రెటా మోడల్ 2024-25లో అత్యధికంగా అమ్ముడైన మోడల్‌గా నిలిచింది. గత రెండు సంవత్సరాలుగా క్రెటా అమ్మకాలు మెరుగ్గా ఉన్నాయని, జనవరి-మార్చి 2024 త్రైమాసికంలో కూడా, క్రెటా విక్రయాలలో వృద్ధి కనిపించిందని గార్గ్ చెప్పారు. 2015లో ప్రారంభించినప్పటి నుండి, హ్యుందాయ్ క్రెటా వరుసగా ఏడు ఆర్థిక సంవత్సరాల పాటు మధ్యతరహా SUV సెగ్మెంట్‌లో ఆధిపత్యం చెలాయించింది.
ఆర్థిక సంవత్సరం 2024లో హ్యుందాయ్ 162,773 యూనిట్ల క్రెటాను విక్రయించినట్లు గార్గ్ వెల్లడించారు, ఇది గత ఏడాదిలో విక్రయించిన 150,372 యూనిట్ల నుండి 8.2 శాతం వృద్ధిని సాధించింది. క్రెటా మోడల్ మాకు ఫ్లాగ్‌షిప్ బ్రాండ్‌గా మిగిలిపోయింది, దాని పనితీరు పరంగా పూర్తి సంతృప్తిగా ఉన్నామని గార్గ్ అన్నారు. కంపెనీ జనవరిలో కొత్త తరం క్రెటాను విడుదల చేసింది, దీని బేస్ వెర్షన్ ధరలు రూ.10,99,900 (ఎక్స్-షోరూమ్), టాప్-ఎండ్ వెర్షన్ రూ.19,99,900.