Rs 2000 Notes: ప్రజల వద్దే రూ. 6,839 కోట్ల విలువైన రూ. 2 వేల నోట్లు: ఆర్‌బీఐ

by Maddikunta Saikiran |   ( Updated:2024-12-03 11:15:22.0  )
Rs 2000 Notes: ప్రజల వద్దే రూ. 6,839 కోట్ల విలువైన రూ. 2 వేల నోట్లు: ఆర్‌బీఐ
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర ప్రభుత్వం(Central Govt) నవంబర్ 2016లో రూ. 1,000, రూ.500 నోట్లను రద్దు చేసి రూ.2వేల నోట్లను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. కాగా 2023 మే నెలలో రూ.2,000 నోట్లను చలామణి(Circulation) నుంచి ఉపసంహరించుకుంది. మొదట నాలుగు నెలల వరకు బ్యాంకుల్లో డిపాజిట్(Deposit) చేసుకునే అవకాశం కల్పించింది. ఆ తర్వాత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) ప్రాంతీయ కార్యాలయాల్లో మార్చుకునే అవకాశమిచ్చింది. అయినా కూడా దేశ ప్రజల వద్ద ఇంకా రూ. 6,839 కోట్ల విలువైన రూ. 2 వేల నోట్లు ఉన్నాయని ఆర్‌బీఐ తాజాగా వెల్లడించింది. ఈ నోట్లను మార్చుకోవడానికి హైదరాబాద్(Hyderabad) సహా దేశవ్యాప్తంగా ఉన్న 19 ఆర్బీఐ కార్యాలయాల్లో(RBI Offices) అవకాశముందని పేర్కొంది. కాగా మే 19,2023న రెండు వేల నోట్లను చలామణి నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు ఆర్‌బీఐ ప్రకటించగా..ఈ ఏడాది నవంబర్ 29 నాటికి దాదాపు 98.08 శాతం నోట్లు తిరిగి బ్యాంకింగ్ వ్యవస్థ(Banking System)లోకి వచ్చాయని తెలిపింది.

Advertisement

Next Story

Most Viewed