RBI: ఇప్పటివరకు బ్యాంకులకు చేరిన 97.96 శాతం రూ. 2 వేల నోట్లు

by S Gopi |
RBI: ఇప్పటివరకు బ్యాంకులకు చేరిన 97.96 శాతం రూ. 2 వేల నోట్లు
X

దిశ, బిజినెస్ బ్యూరో: భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) సోమవారం నాటి ప్రకటనలో ఇప్పటివరకు 97.96 శాతం రూ. 2 వేల నోట్లు తిరిగి బ్యాంకులకు చేరాయని తెలిపింది. ఉపసంహరించుకున్న నోట్లలో రూ. 7,261 కోట్ల విలువైన నోట్లు మాత్రమే ఇంకా ప్రజల వద్ద ఉన్నాయి. 2023, మే 19న ఆర్‌బీఐ రూ. 2000 నోట్ల చెలామణిని ఉపసంహరించుకున్న సంగతి తెలిసిందే. ఆర్‌బీఐ ప్రకటన నాటికి దేశంలో మొత్తం రూ. 2.56 లక్షల కోట్ల విలువైన పెద్దనోట్లు వ్యవస్థలో ఉన్నాయి. ఈ ఏడాది ఆగష్టు నాటికి ఇది రూ. 7,261 కోట్లకు తగ్గింది. గతేడాది బ్యాంకుల్లోనే ఈ నోట్లను మార్చుకోవడం లేదా డిపాజిట్ చేసే అవకాశాన్ని ఆర్‌బీఐ కల్పించింది. అందుకు అక్టోబర్ 7 వరకు గడువు ఇచ్చింది. ఆ తర్వాత ప్రాంతీయ ఆర్‌బీఐ కార్యాలయాల్లోనే నోట్లను తీసుకుంటోంది. ఇప్పటికీ ఎవరి దగ్గరైనా రూ. 2 వేల నోట్లు ఉంటే ఆర్‌బీఐ రీజనల్ ఆఫీసులో మార్చుకోవచ్చు లేదా డిపాజిట్ చేయవచ్చని ఆర్‌బీఐ స్పష్టం చేసింది. రీజనల్ ఆఫీసులకు వెళ్లలేని వారు పోస్టల్ ద్వారా కూడా పంపించే సదుపాయాన్ని ఆర్‌బీఐ ఏర్పాట్ చేసింది.

Advertisement

Next Story

Most Viewed