- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
19 శాతం పెరిగిన రిలయన్స్ లాభాలు!
ముంబై: దేశీయ అతిపెద్ద సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికానికి సంబంధించి నికర లాభం 19.10 శాతం పెరిగి రూ. 19,299 కోట్లకు చేరుకుందని ప్రకటించింది. గతేడాది మార్చి త్రైమాసికంలో సంస్థ రూ. 16,203 కోట్ల లాభాలను వెల్లడించింది. సమీక్షించిన కాలంలో కంపెనీ ఆదాయం స్వల్పంగా 2.12 శాతం పెరిగి రూ. 2,16,376 కోట్లకు చేరుకుంది.
గతేడాది ఇదే త్రైమాసికంలో ఆదాయం రూ. 2,11,887 కోట్లుగా ఉంది. వినియోగ వ్యాపారాల్లో వృద్ధి ఊపందుకోవడంతో కంపెనీ ఆదాయం గణనీయంగా పెరిగిందని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది.
డిజిటల్ సేవల విభాగం 15.4 శాతం వృద్ధిని సాధించగా, రిటైల్ విభాగం 19.4 శాతం పెరిగింది. కంపెనీ టెలికాం విభాగం జియో సమీక్షించిన త్రైమాసికంలో రూ. 4,716 కోట్ల లాభాలను వెల్లడించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ. 4,173 కోట్లతో పోలిస్తే 13 శాతం పెరిగింది. అలాగే, కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయం 12 శాతం వృద్ధితో రూ. 23,394 కోట్లకు చేరుకుంది.
ఫలితాల వెల్లడి సందర్భంగా మాట్లాడిన ముఖేశ్ అంబానీ, రిలయన్స్ ఆర్థిక సేవల విభాగం జియో ఫైనాన్షియల్ సర్వీసెస్‌ను లిస్టింగ్ చేయనున్నట్టు ప్రకటించారు. ఈ నిర్ణయం ద్వారా పెట్టుబడిదారులకు కొత్త ప్రయోజనాలు లభిస్తాయన్నారు.
Also Read...అరుదైన ఘనతను సాధించిన ITC