ఆగస్టు 28న రిలయన్స్ 46 వ వార్షిక సమావేశం

by Harish |   ( Updated:2023-08-05 05:03:32.0  )
ఆగస్టు 28న రిలయన్స్ 46 వ వార్షిక సమావేశం
X

ముంబై: దేశీయ దిగ్గజ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ తన 46 వ వార్షిక సాధారణ సమావేశం (ఏజీఏం) తేదీలను ప్రకటించింది. ఆగస్టు 28న మధ్యాహ్నం 2 గంటలకు ఈ ఈవెంట్ జరుగుతుందని కంపెనీ తెలిపింది. దీని ఏజెండా గురించి ఇంకా ప్రకటించనప్పటికి జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ షేర్ లిస్టింగ్‌కు సంబంధించి కొన్ని ప్రకటనలు వచ్చే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ నుంచి జియో ఫైనాన్షియల్ విడిపోయిన తరువాత జరుగుతున్న సమావేశం కారణంగా మార్కెట్ వర్గాలు, షేర్ హోల్డర్లు చాలా ఆసక్తిగా ఉన్నారు.

ఈ ఈవెంట్ మొత్తం కూడా వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా జరుగుతుందని రియలన్స్​ తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది. దీంతో పాటు 2022-23 ఆర్థిక సంవత్సరానికి డివిడెండ్ చెల్లింపు తేదీని కూడా ప్రకటించింది, ఆగస్టు 21, 2023ని రికార్డ్ డేట్‌గా నిర్ణయించినట్లు పేర్కొంది. రిలయన్స్ బోర్డు ఇప్పటికే ఈ ఆర్థిక సంవత్సరానికి ఒక్కో షేరుకు రూ. 9 తుది డివిడెండ్ ప్రకటించింది. 21 ఆగస్టు 2023న రిలయన్స్ షేర్‌లను కలిగి ఉన్నవారు డివిడెండ్ పొందడానికి అర్హులు.

స్టాక్ ఎక్స్ఛేంజీలోకి ITC హోటల్స్..!

Advertisement

Next Story