- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అక్రమ లోన్ యాప్‌ల నియంత్రణకు ఆర్‌బీఐ డిజిటల్ ఇండియా ట్రస్ట్ ఏజెన్సీ ఏర్పాటు
దిశ, బిజినెస్ బ్యూరో: పెరుగుతున్న సైబర్ మోసాలను అరికట్టే ప్రయత్నాల్లో భాగంగా ఆర్‌బీఐ కీలక నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. ఎప్పటికప్పుడు పెరుగుతున్న అక్రమ లోన్ యాప్‌లను నిలువరించేందుకు డిజిటల్ ఇండియా ట్రస్ట్ ఏజెన్సీ(డీఐజీఐటీఏ)ని ఏర్పాటు చేయాలని భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) భావిస్తోంది. ప్రతిపాదిత ఏజెన్సీ డిజిటల్ లెండింగ్ యాప్‌ల వెరిఫికేషన్‌ను, వెరిఫైడ్ యాప్‌ల పబ్లిక్ రిజిస్టర్‌ను నిర్వహిస్తుంది. ఏవైనా లోన్ యాప్‌లు డీఐజీఐటీఏ 'ధృవీకరణ సంతకం' లేకుండా కార్యకలాపాలు నిర్వహిస్తే వాటిని అనధికారిక ప్లాట్‌ఫామ్‌గా పరిగణిస్తారు. డిజిటల్ రంగలో ఆర్థిక నేరాలకు వ్యతిరేకంగా తీసుకుంటున్న చర్యల్లో ఇది కీలకమైన చెక్‌పాయింట్‌గా ఉపయోగపడుతుందని సంబంధిత వర్గాలు అంచనా వేస్తున్నాయి. డిజిటల్ రుణాల రంగంలో సమగ్రమైన ధృవీకరణ ప్రక్రియ పెరుగుతున్న నేపథ్యంలో మరింత పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంచేందుకు ఈ ఏజెన్సీ ఉపయోపడుతుంది. కాగా, ఇటీవల ఆర్‌బీఐ నమ్మదగిన 442 డిజిటల్ లెండింగ్ యాప్‌ల జాబితాను గూగుల్‌తో పంచుకున్నట్టు సమాచారం. ఇక, గూగుల్ తన యాప్ స్టోర్ నుంచి 2022, సెప్టెంబర్-2023, ఆగష్టు మధ్య 2,200 డిజిటల్ లెండింగ్ యాప్‌లను తొలగించింది.