బిజినెస్ అకౌంట్స్ క్రెడిట్, డెబిట్ కార్డు నిబంధనలను కఠినతరం చేసిన ఆర్‌బీఐ

by S Gopi |
బిజినెస్ అకౌంట్స్ క్రెడిట్, డెబిట్ కార్డు నిబంధనలను కఠినతరం చేసిన ఆర్‌బీఐ
X

దిశ, బిజినెస్ బ్యూరో: వ్యాపార ఖాతాల కోసం ఉపయోగించే క్రెడిట్, డెబిట్ కార్డుల నిబంధనలను భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) కఠినతరం చేసింది. ఈ మేరకు గురువారం ప్రకటన విడుదల చేసింది. నిధుల వినియోగాన్ని పర్యవేక్షించడానికి సమర్థవంతమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని బిజినెస్ కార్డు జారీ చేసే బ్యాంకులు, సంస్థలను కోరింది. ఫిన్‌టెక్ కంపెనీల భాగస్వామ్యంతో బిజినెస్-టూ-బిజినెస్ కార్డు చెల్లింపులు చేసేందుకు ఇతర రూట్లను ఉపయోగించడం నిలిపేయాలని గత నెలలో ఆర్‌బీఐ కార్డు నెట్‌వర్క్ సంస్థ వీసాను ఆదేశించింది. ఔట్‌సోర్సింగ్ పార్ట్‌నర్‌ల విధులు తప్పనిసరి అయినప్పుడు తప్ప, కార్డు జారీచేసే బ్యాంకులు లేదా సంస్థలు వినియోగదారుల డేటాను ఔట్‌సోర్సింగ్ భాగస్వాములతో పంచుకోకూడదని ఆర్‌బీఐ స్పష్టం చేసింది. డేటాను పంచుకోవాల్సిన అవసరం ఉన్నట్లయితే కార్డు ఉన్న ఖాతాదారుడి నుంచి స్పష్టమైన అనుమతి పొందాల్సి ఉంటుందని, కార్డు డేటా, ఇతర వివరాలు కార్డు జారీ చేసిన వారి వద్దే ఉండాలని తెలిపింది. ఈ కొత్త ఆదేశాలు ఖాతాదారుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని తీసుకున్నట్టు పేర్కొంది.

Advertisement

Next Story