- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
UPI Lite: యూపీఐ లైట్ లావాదేవీ పరిమితిని రూ. 1000కి పెంచిన ఆర్‌బీఐ
దిశ, బిజినెస్ బ్యూరో: భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) బుధవారం యూపీఐ లైట్ పరిమితిని ఒక్కో లావాదేవీకి రూ. 500 నుంచి రూ. ,1000 పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అలాగే, యూపీఐ వ్యాలెట్ పరిమితిని రూ. 2,000 నుంచి రూ. 5,000కి పెంచింది. దీనికోసం ఆఫ్‌లైన్ మోడ్‌లో చిన్న మొత్తం డిజిటల్ చెల్లింపులను సులభతరం చేసే లక్ష్యంతో ఆర్‌బీఐ 2022, జనవరిలో జారీ చేసిన 'ఆఫ్‌లైన్ ఫ్రేమ్‌వర్క్'ని బుధవారం సవరించింది. యూపీఐ లైట్ లావాదేవీలు అడిషనల్ ఫ్యాక్టర్ ఆఫ్ అథెంటికేషన్ (ఏఎఫ్ఏ) అవసరం లేనంత వరకు ఆఫ్‌లైన్ మోడ్‌లో జరుగుతాయి. అలాగే, పరిమితి తర్వాత తిరిగి వ్యాలెట్‌లో నగదు ఉంచేందుకు ఏఎఫ్ఏ ద్వారా ఆన్‌లైన్ మోడ్‌లో మాత్రమే చేసుకోవడానికి అనుమతి ఉంటుందని ఆర్‌బీఐ ఓ ప్రకటనలో తెలిపింది. యూపీఐ లైట్ అనేది యూపీఐ పిన్ అవసరం లేకుండా తక్కువ మొత్తం లావాదేవీలకు అనుమతించే వ్యాలెట్. యూపీఐ సేవల ద్వారా డిజిటల్ చెల్లింపులతో భారత ఆర్థిక రంగ రూపురేఖలు మారిపోయాయి. వీటిని మరింత విస్తరించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అక్టోబర్ నాటి ఎంపీసీ సమావేశం అనంతరం ప్రకటనలో వెల్లడించారు. ఆ సమావేశంలోనే యూపీఐ లైట్ పరిమితి పెంచాలని ఎంపీసీ సభ్యులు నిర్ణయం తీసుకున్నారు.