- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
2000 నోట్ల రద్దు.. ఆర్బీఐ గవర్నర్ కీలక వ్యాఖ్యలు
దిశ, వెబ్ డెస్క్: 2000 నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు ఈ నెల 19న ఆర్బీఐ ప్రకటించింది. దేశంలోని అన్ని బ్యాంకులతో పాటు 19 ఆర్బీఐ కేంద్రాల్లోనూ నోట్ల మార్పిడి చేసుకోవచ్చని, అందుకు సెప్టెంబర్ 30 వరకు గడువు ఇచ్చింది. విడతకు రూ.20 వేల చొప్పున బ్యాంకుల్లో ఎంత డబ్బునైనా మార్చుకోవచ్చని ఆర్బీఐ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే 2000 నోట్లను మార్చుకునేందుకు బ్యాంకులకు క్యూ కడుతున్నారు. మనీ ఎక్సేంచ్ కు ఒక్కో బ్యాంకు ఒక్కో రకంగా వ్యవహరిస్తున్న వేళ ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ స్పందించారు.
నోట్ల మార్పిడి విషయంలో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. సెప్టెంబర్ 30 వరకు దాదాపు 4 నెలల గడువు ఇచ్చామని, విషయాన్ని సీరియస్ గా తీసుకొని 2000 నోట్లను బ్యాంకుల్లో రిటర్న్ చేయాలని కోరారు. ఇక ఈ 2000 నోట్ల మార్పిడి ప్రక్రియ రేపటి నుంచి దేశంలోని అన్ని బ్యాంకుల్లో ప్రారంభం అవుతుందని, బ్యాంకు అధికారులు వినియోగదారులకు కావాల్సిన అన్ని వసతులు ఏర్పాటు చేయాలని కోరారు. ప్రజల ఎక్కువ సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నందును బ్యాంకు ఎదుట టెంట్లు ఏర్పాటు చేయాలని, అలాగే తాగు నీరు కూడా అందించాలని ఆదేశించారు.
రోజుకు రూ.20 వేల వరకు మార్చుకోవచ్చని, ఇక డిపాజిట్ల విషయంలో ఎలాంటి పరిమితులు లేవని చెప్పారు. ఇక డబ్బు డిపాజిట్ విషయంలో ప్రస్తుతం బ్యాంకులు పాటిస్తున్న విధానాన్ని ఈ 2000 నోట్ల డిపాజిట్ కూ వర్తిస్తుందని చెప్పారు. పెద్ద మొత్తం అయ్యే డిపాజిట్ల విషయంలో ఇన్ కం ట్యాక్స్ అధికారులు చూసుకుంటారని తెలిపారు. 50 వేల కంటే ఎక్కువ డిపాజిట్ చేస్తే తప్పనిసరిగా పాన్ కార్డు జిరాక్స్ సమర్పించాలని చెప్పారు. ఇక 1000 నోట్లను మళ్లీ తీసుకురానున్నారని వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని ఆర్బీఐ గవర్నర్ స్పష్టం చేశారు.
Also Read..