ఆర్‌బీఐ కొత్త ఈడీలుగా అర్నబ్ కుమార్ చౌదరి, చారులత ఎస్.కర్

by Hajipasha |
ఆర్‌బీఐ కొత్త ఈడీలుగా అర్నబ్ కుమార్ చౌదరి, చారులత ఎస్.కర్
X

దిశ, బిజినెస్ బ్యూరో: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) కొత్త ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లుగా అర్నబ్ కుమార్ చౌదరి, చారులత ఎస్.కర్ నియమితులయ్యారు.ఈ విషయాన్ని ఆర్‌బీఐ ఓ ప్రకటనలో వెల్లడించింది. అర్నబ్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆర్‌బీఐకు చెందిన డిపాజిట్ ఇన్సూరెన్స్, క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్, ఫారిన్ ఎక్స్ఛేంజ్ డిపార్ట్‌మెంట్, ఇంటర్నేషనల్ డిపార్ట్‌మెంట్‌లను చూస్తారు. చారులత ఎస్.కర్ ఆర్‌బీఐకు చెందిన కమ్యూనికేషన్ విభాగం, హెచ్‌ఆర్ విభాగం, రైట్ టు ఇన్ఫర్మేషన్ విభాగాలను పర్యవేక్షించనున్నారు.ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పదోన్నతి పొందకముందు అర్నబ్ ఆర్‌బీఐ పర్యవేక్షణ విభాగంలో చీఫ్ జనరల్ మేనేజర్ ఇన్‌ఛార్జ్‌గా పనిచేశారు. ఆయనకు ఆర్థిక సంస్థల పర్యవేక్షణలో దాదాపు మూడు దశాబ్దాల అనుభవం ఉంది. ఇక ఈ పదోన్నతి పొందకముందు చారులత ఆర్బీఐకు చెందిన హెచ్‌ఆర్ విభాగంలో చీఫ్ జనరల్ మేనేజర్ ఇన్‌ఛార్జ్‌గా సేవలు అందించారు.

Advertisement

Next Story

Most Viewed