- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మీ PAN Card పోయిందా.. ఇలా చేసి చిటికెలో పొందండి
దిశ, వెబ్‌డెస్క్ : ప్రతి ఒక్కరికీ పాన్ కార్డ్ అనేది చాలా ముఖ్యం. ఈరోజుల్లో ఆధార్ కార్డ్ ఎంత అవసరమో పాన్ కార్డ్ కూడా అంతే అవసరం. ఎలాంటి బ్యాంకు వర్క్స్‌కైనా సరే పాన్ కార్డ్ తప్పని సరి. కానీ కొందరు అనుకోకుండా, పాన్ కార్డ్‌ను పోగొట్టుకుంటారు. ఎంత వెతికినా అది దొరకదు. దీంతో చాలా బాధపడుతారు. అయితే పాన్ కార్డ్ పోతే కంగారు అవసరం లేదంటున్నారు అధికారులు. దాన్ని ఈజీగా పొందవచ్చునంట. అది ఎలా అనుకుంటున్నారా?
NSDL e-Gov ద్వారా ఇటీవల PAN అప్లికేషన్ ద్వారా ప్రాసెస్ చేసిన వాళ్ళు లేదంటే, ఆదాయపు పన్ను శాఖ ఈ-ఫైలింగ్ పోర్టల్‌లో తక్షణ e-PAN ఫెసిలిటీ తో PAN పొందిన కార్డ్ హోల్డర్‌లు ఇలా చేయడం ద్వారా ఈజీగా పాన్ కార్డ్ పొంద వచ్చు.
మొదటగా.. https://www.onlineservices.nsdl.com/paam/ReprintEPan.html లింక్ ఓపెన్ చేయాలి.
అనంతరం అందులో ఆధార్ నంబర్, పుట్టిన తేదీ మొదలైన వివరాలను సరిగ్గా ఎంటర్ చేయాలి.
ఆధార్ వివరాలను ఉపయోగించడానికి దరఖాస్తుదారు పెర్మిషన్ అడుగుతుంది.. తప్పనిసరిగా పర్మిషన్ ఇవ్వాలి.
అలానే అక్కడ వచ్చే క్యాప్చా కోడ్‌ను ఎంటర్ చేయాలి.
తర్వాత ప్రాసెస్ పూర్తి కాగానే, పాన్ కార్డ్ రీప్రింట్ ని మీ ఇంటికి పంపేందుకు మనీ పే చెయ్యాలి.
అక్కడ ఒక ఫారం కనిపిస్తుంది. దాన్ని నింపిన తర్వాత ఆన్‌లైన్‌లో యాభై రూపాయలు మనీ పే చెయ్యాల్సి ఉంటుంది.
రీప్రింట్ చేసిన పాన్ కార్డ్ ఆదాయపు పన్ను శాఖ డేటాబేస్‌లో అందుబాటులో ఉంచిన చిరునామాకు పంపిస్తారు.
Also Read:అమెరికా కంపెనీలో మెజారిటీ వాటా కొనుగోలుకు రిలయన్స్ ఒప్పందం!