- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Post Office Scheme: పెట్టుబడి రూ.10 వేలు.. రాబడి రూ.17 లక్షలు.. పోస్టాఫీస్ అందిస్తున్న సూపర్ స్కీమ్ ఇదే!

దిశ, వెబ్ డెస్క్: Post Office Scheme: నేటికాలంలో సంపాదించే డబ్బుకు, చేసే ఖర్చుకు ఎలాంటి పొంతన లేకుండా పోయింది. సామాన్యులకు ఆదాయం తక్కువ.. ఖర్చులు ఎక్కువయ్యాయి. అయితే ఖర్చులను అదుపులో పెట్టుకుని పొదుపు మంత్రాన్ని పాటిస్తే సంపదను పెంచుకోవచ్చు. ఈరోజు మీరు చేసే చిన్న పొదుపే రేపు మిమ్మల్ని లక్షాధికారిని చేస్తుంది. పొదుపు చేయడమే కాదు.. దాన్ని భారీ లాభాలను అందించే స్కీముల్లో పెట్టుబడి పెట్టడం చాలా మంచిది. అయితే పెట్టుబడి ఎప్పుడు సురక్షితంగా ఉండే విధంగా చూసుకోవాలి. అందుకోసం ప్రభుత్వానికి చెందిన స్కీముల్లోనే ఇన్వెస్ట్ చేయడం చాలా వరకు సురక్షితం.
ప్రభుత్వ స్కీముల్లో ఒకటి పోస్టాఫీస్ అందించే రికవరింగ్ డిపాజిట్ స్కీము ఒకటి. దీనిలో నెలకు రూ. 10వేలు పెట్టుబడి పెడితే మెచ్యూరిటీ నాటికి రూ. 17లక్షలు మీ చేతికి అందుతాయి. మంచి రాబడి పొందేందుకు పోస్టాఫీస్ రికవరింగ్ డిపాజిట్ మంచి ఛాయిస్ అని చెప్పవచ్చు. ఈ స్కీములో కనీసం రూ. 100 డిపాజిట్ చేయవచ్చు. గరిష్టంగా ఎంతైనా పెట్టుబడి పెట్టుకోవచ్చు. మీరు పెట్టే పెట్టుబడిపై ఆధారపడి వచ్చే రాబడి ఉంటుంది. ఇందులో సింగిల్ అమౌంట్ కింద ఒకరు, జాయింట్ అకౌంట్ కింద గరిష్టంగా ముగ్గురు ఈ స్కీములో చేరవచ్చు.
మైనర్ పేరిట సంరక్షకులు ఖాతా తీయవచ్చు. రికవరింగ్ డిపాజిట్ స్కీములో వడ్డీ రేటు ప్రస్తుతం 6.7శాతంగా ఉంది. స్కీము మెచ్యూరిటీ పిరియడ్ ఐదేళ్లు. మంచి రాబడి కోరుకునేవారు మరో 5ఏళ్లు పొడిగించుకోవచ్చు. ఈ స్కీములో రూ. 17లక్షలు పొందాలంటే నెలకు రూ. 10వేలు పొదుపు చేయాలి. ప్రతినెల రూ. 10వేల పెట్టుబడితో ఏడాదికి రూ. 1,20, 000 జమ అవుతుంది. 5ఏళ్లకు పెట్టుబడి మొత్తం రూ. 6లక్షలు అవుతుంది.
ప్రస్తుతము ఉన్న వడ్డీ రేటు ప్రకారం వడ్డీ రూపంలో రూ. 1,13,659 వస్తుంది. అప్పుడు అసలు వడ్డీ కలుపుకుని మెచ్యూరిటీ నాటికి రూ. 7,13,659 మీ చేతికి అందుతుంది. మరో 5ఏళ్లు పొడిగిస్తే పెట్టుబడి రూ. 12లక్షలు అవుతుంది. మెచ్యూరిటీ నాటికి రూ. 17,08, 546 మీ చేతికి అందుతాయి.