- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పీఎన్‌బీ ఖాతాదారులు అలర్ట్.. జూన్ 1 నుంచి ఇన్‌యాక్టివ్ అకౌంట్లు క్లోజ్
దిశ, బిజినెస్ బ్యూరో: ప్రభుత్వ రంగ పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్‌బీ) తన ఖాతాదారులకు కీలక ప్రకటన విడుదల చేసింది. కొన్ని సంవత్సరాలుగా యాక్టివ్‌గా లేని అకౌంట్లు ఈ నెలాఖరు వరకే పనిచేస్తాయని, ఆలోపు కేవైసీ పూర్తిచేయని ఖాతాలను మూసేయనున్నట్టు ఓ ప్రకటనలో వెల్లడించింది. మే 31 నాటికి నో యువర్ కస్టమర్(కేవైసీ) ప్రక్రియ పూర్తి చేస్తే తప్ప, గత మూడేళ్ల నుంచి ఎలాంటి లావాదేవీ జరగని, బ్యాలెన్స్ లేని ఖాతాలను మూసేయనున్నారు. నిర్దేశించిన తేదీ తర్వాత సదరు ఖాతాదారులకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అకౌంట్లు రద్దు అవనున్నాయి. ఏప్రిల్ 30 నాటికి మూడేళ్లుగా ఇన్‌యాక్టివ్‌గా ఉండి, జీరో బ్యాలెన్స్ ఉన్న ఖాతాలు మూసేయనున్నారు. ఇదే సమయంలో డీమ్యాట్ ఖాతాలు, లాకర్లు లేదా యాక్టివ్ స్టాండింగ్ సూచనలకు లింక్ చేసిన ఖాతాలు, 25 ఏళ్లలోపు స్టూడెంట్ ఖాతాలు, మైనర్ అకౌంట్లు, వివిధ పథకాలకు చెందిన ఖాతాలు, కోర్టు ఉత్తర్వులు, ఆదాయ పన్ను శాఖ, చట్టబద్దమైన అధికారులు ఫ్రీజ్ చేసిన ఖాతాలకు మినహాయింపు ఉంటుంది. ఇన్‌యాక్టివ్‌గా ఉన్న ఖాతాలు కొనసాగాలంటే మే 31లోపు బ్యాంకు బ్రాంచులో కేవైసీ డాక్యుమెంట్లను సమర్పించాల్సి ఉంటుంది. ఇన్‌యాక్టివ్ ఖాతాలు దుర్వినియోగం కాకుండా చూసేందుకే ఈ చర్యలు తీసుకుంటున్నట్టు బ్యాంకు వెల్లడించింది.