- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రూ. 2,847 కోట్ల విలువైన నిధులు సేకరించిన PhonePe!
ముంబై: ఇటీవల వాల్‌మార్ట్ నుంచి పూర్తిగా వేరైన ప్రముఖ ఫిన్‌టెక్ కంపెనీ ఫోన్‌పే కొత్తగా రూ. 2,847 కోట్ల(350 మిలియన్ డాలర్ల) విలువైన నిధులను సేకరించింది. ఈ నెలలో కంపెనీ మొత్తం 1 బిలియన్ డాలర్ల నిధులు సేకరించాలనే లక్ష్యంతో ఉంది. 12 బిలియన్ డాలర్ల విలువైన కంపెనీ విలువ వద్ద జనరల్ అట్లాంటిక్ సంస్థ నిధులు సమకూర్చింది. ఈ నిధుల సమీకరణతో ఫోన్‌పే కంపెనీ 2020లో 5.5 బిలియన్ డార్ల విలువైన కంపెనీ నుంచి దాదాపు రెట్టింపు విలువను దక్కించుకుంది. వాల్‌మార్ట్ నుంచి విడిపోయిన అనంతరం ఫోన్‌పే తన ప్రధాన కార్యాలయాన్ని సింగపూర్ నుంచి భారత్‌కు మార్చింది. దీంతో ప్రస్తుతం పూర్తిస్థాయి భారతీయ సంస్థగా మారింది. ఈ నేపథ్యంలో నిధుల సేకరణ ద్వారా మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడంతో పాటు డేటా సెంటర్లు, ఆర్థిక సేవల విస్తరణ, బీమా, రుణాలు, నిర్వహణ వంటి అవసరాలకు నిధులను వినియోగించనున్నట్టు తెలుస్తోంది. డిజిటల్ చెల్లింపులు పెరిగేందుకు చర్యలు చేపట్టనున్నట్టు కంపెనీ తెలిపింది. కాగా, 2015 డిసెంబర్‌లో ప్రారంభమైన ఫోన్‌పే ఇప్పటివరకు 40 కోట్ల యూజర్లను కలిగి ఉంది.