SIP Closure: ఒక్క నెలలోనే 61 లక్షల సిప్‌ అకౌంట్లు క్లోజ్.. ఇలా ఎందుకు జరుగుతోంది?

by Vennela |
SIP Closure:  ఒక్క నెలలోనే 61 లక్షల సిప్‌ అకౌంట్లు క్లోజ్.. ఇలా ఎందుకు జరుగుతోంది?
X

దిశ, వెబ్‌డెస్క్: SIP Closure: స్టాక్ మార్కెట్లో(Stock Market) గత కొన్నాళ్లుగా ఒడుదొడుకులు కనిపిస్తున్న సంగతి తెలిసిందే. అయినప్పటికీ మ్యూచువల్ ఫండ్స్(Mutual Funds) లో దీర్ఘకాలిక పెట్టుబడులు మంచి రిటర్న్స్ ఇస్తాయని చాలా మంది ఆశిస్తుంటారు. ఈ కారణంతోనే గత కొంత కాలంగా ఈక్విటీల్లోకి సిప్(SIP) రూపంలో పెద్ద మొత్తంలో పెట్టుబడులు వచ్చాయి. అయితే ఇది జనవరిలో కాస్త తగ్గుముఖం పట్టింది. కొత్త సిప్(SIP) రిజిస్ట్రేషన్ల సంఖ్య కంటే నిలిచిపోయినవే ఎక్కువగా ఉన్నాయి.

దీర్ఘకాలంలో మంచి రిటర్న్స్ అందుకునేందుకు మ్యూచువల్ ఫండ్స్(Mutual Funds) ఒక బెస్ట్ ఆప్షన్ అని చాలా మంది అనుకుంటారు. ఇక్క కాంపౌండింగ్ ఎఫెక్ట్ కారణంగా ఏటా సంపద పెరుగుతూ పోతుండటమే ప్రభావం చూపిస్తుంది. నిపుణులు కూడా ఇదే చెబుతారు. అందుకే నెల నెలా కొత్తగా సిప్ అకౌంట్లు తెరిచేవారి సంఖ్య పెట్టుబడులు పెరుగుతుండటం వెరసి..మొత్తంగా మ్యూచువల్ ఫండ్ల(Mutual Funds) పై జనం ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. మ్యూచువల్ ఫండ్స్ (Mutual Funds) లో ముఖ్యంగా సిప్ పై జనం మొగ్గుచూపిస్తుంటారు. మ్యూచువల్ ఫండ్స్ (Mutual Funds) లో సిప్(SIP) పెట్టుబడులే ఎక్కువగా ఉంటాయి. దీనికి తగ్గట్లుగానే గతఏడాది డిసెంబర్ లో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్(Mutual Funds) లో ఏకంగా రూ. 41వేల కోట్లకుపైగా పెట్టుబడులు తరలివచ్చాయి. సిప్ ద్వారానే ఇది రూ. 26, 549 కోట్లుగా ఉంది.

అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్(Mutual Funds) ఇన్ ఇండియా ఇప్పుడు జనవరికి సంబంధించిన డేటా విడుదల చేసింది. ఈక్విటీ ఫండ్లలోకి జనవరిలో మొత్తం పెట్టుబడులు రూ. 39, 688కోట్లు వచ్చాయి. ఇంకాసిప్ పెట్టుబడులు రూ. 26,400కోట్లుగా ఉంది. అంటే ఇప్పటివరకు అత్యధికంగా ఈక్విటీ పెట్టుబడులు, సిప్ కాంట్రిబ్యూషన్స్ డిసెంబర్ లోనే ఉండగా..దానిని అధిగమించలేకపోయింది.

ఇక సిప్ కింద నిర్వహణలో ఉన్న మొత్తం ఆస్తుల విలువ రూ. 13.20లక్షల కోట్లుగా ఉంది. మొత్తం మ్యూచువల్ ఫండ్లలో నికర ఆస్తుల విలువ 2025 జనవరి 31 నాటికి రూ. 67.25లక్షల కోట్లకు చేరుకుంది. ఇక్కడ ప్రధానంగా సిప్ కాంట్రిబ్యూషన్ ఈక్విటీ ఫండ్ (Mutual Funds)పెట్టుబడులు తగ్గడానికి ప్రధాన కారణం..స్టాక్ మార్కెట్ ఒడుదొడుకులు. గత కొద్ది నెలలుగా స్టాక్ మార్కెట్ పనితీరు ఏమాత్రం బాగలేదు. అందుకే మార్కెట్ తో లింక్ అయి ఉండే మ్యూచువల్ ఫండ్స్ (Mutual Funds)లో పెట్టుబడులు కాస్త తగ్గాయని నిపుణులు చెబుతున్నారు. ఎక్కువగా ఈక్విటీ ఆధారిత మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడులు తగ్గాయి. అదే బంగారం ధరలు పెరిగిన క్రమంలో గోల్డ్ ఈటీఎఫ్స్ లోకి పెట్టుబడులు పెరగడం విశేషం.

మార్కెట్ అస్థిరతల నేపథ్యంలోనే కొత్తగా సిప్ అకౌంట్లు తెరిచిన వారి సంఖ్య కంటే సిప్ క్లోజ్ చేసిన వారి సంఖ్యే ఎక్కువగా ఉంది. 2025 జనవరిలో కొత్త సిప్ రిజిస్ట్రేషన్స్ 56.19 లక్షలుగా ఉంది. క్లోజ్ డిస్ కంటిన్యూ చేసిన సిప్ ల సంఖ్య ఒక్క నెలలోనే 61.33 లక్షలుగా ఉంది. ఇప్పటి వరకు ఇదే అత్యధికం. అయితే వీటిల్లో ఎక్కువగా టెన్యూర్ కంప్లీట్ అయినవి లేదా లాంగ్ టర్మ్ కోసం చిన్న సిప్ క్లోజ్ చేసి పెద్ద సిప్ కు వెళ్లినవారు ఉన్నట్లు లెక్చ తేల్చిన ఈఏంఎఫ్ఐ ఇంకా ఎక్స్ఛేంజీలు ఆర్టీఏ మధ్య సయోధ్య తర్వాత 25లక్షల సిప్ అకౌంట్లను తొలగించినట్లు తెలిసింది. అందుకే ఈ సంఖ్య కాస్త ఎక్కువగా కనిపిస్తోందని వెల్లడించింది. ఈ క్రమంలోనే ముందటి నెలలో అంటే 2024 డిసెంబర్ లో 10.32 కోట్లుగా ఉన్న సిప్ అకౌంట్ల సంఖ్య జనవరి నాటికి 10.26కోట్లకు తగ్గింది.

కొత్తగా సిప్ తెరిచేవారి సంఖ్య మార్కెట్ల ఒడుదొడుకుల నేపథ్యంలో ఇటీవల కాస్త తగ్గిందని చెప్పవచ్చు. గత ఏడాది జులైలో ఒక్క నెలలోనే ఏకంగా 72లక్షలకుపైగా కొత్త సిప్ అకౌంట్లను తెరిచారు. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలలో కూడా ఇది 60లక్షలకుపైనే నమోదు అవుతూ వచ్చింది. మళ్లీ మార్కెట్ల పతనం నేపథ్యంలో ఇటీవల సగటున 50లక్షలుగా నమోదు అవుతూ వస్తోంది.

Next Story

Most Viewed