- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఒకే నెలలో కోటికి చేరిన మొబైల్ నెంబర్-ఆధార్ లింకింగ్.. ఇప్పటి వరకు మొత్తం ఎన్ని కోట్లంటే..
దిశ, వెబ్‌డెస్క్: మొబైల్ నెంబర్-ఆధార్ గురించి యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా శుక్రవారం కీలక విషయాలను వెల్లడించింది. ఫిబ్రవరి నెలలో మొత్తం ఒక కోటి మొబైల్ నంబర్లను ఆధార్‌తో లింక్ చేసినట్లు పేర్కొంది. ఇంతకుముందు జనవరి నెలలో ఈ సంఖ్య 56.7 లక్షలుగా ఉంది. దీంతో ఫిబ్రవరి నెలలో 93 శాతం ఎక్కువగా ప్రజలు తమ ఆధార్-మొబైల్ నెంబర్ లింక్ ప్రక్రియను పూర్తి చేసినట్లు యుఐడీఎఐ తెలిపింది.
అలాగే, ఇప్పటి వరకు 90 కోట్ల మంది ఆధార్ వినియోగదారులు తమ మొబైల్ నంబర్‌లను తమ యూనిక్ ఐడీతో లింక్ చేసినట్లు అంచనా. వివిధ సంక్షేమ పథకాలను పొందడానికి ఆధార్‌తో, మొబైల్ నెంబర్ లింక్ చేయాలని ప్రభుత్వం గత కొంత కాలంగా పేర్కొంటుంది. ఆధార్ ఆధారిత లావాదేవీలు క్రమంగా పెరుగుతున్నాయి. జనవరిలో జరిగిన 199.62 కోట్ల లావాదేవీల కంటే ఫిబ్రవరిలో ఆధార్ ప్రామాణీకరణ లావాదేవీలు 13 శాతం పెరిగి 226.29 కోట్లకు చేరుకున్నాయి.