లక్షమంది మెకానిక్ లకు ఈవీలపై శిక్షణ ఇవ్వనున్న 'ఓలా'

by M.Rajitha |
లక్షమంది మెకానిక్ లకు ఈవీలపై శిక్షణ ఇవ్వనున్న ఓలా
X

దిశ, వెబ్ డెస్క్ : ద్విచక్ర ఈవీ(EV)ల తయారీ సంస్థ ఓలా(Ola) మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఓలా ఎలక్ట్రిక్ సర్వీస్ సేవల్ని విస్తరించే దిశగా.. సొంత సర్వీస్ సెంటర్లను వెయ్యికి పెంచే పనుల్లో ఉంది. కస్టమర్ల నుండి వచ్చే ఫిర్యాదులకు ప్రస్తుతం ఉన్న సర్వీస్ సెంటర్లు సరిపోవడం లేదని.., ఒక్కోసారి కస్టమర్ అధిక సమయం వేచి చూడాల్సి వస్తుండటం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలియ జేసింది. ఈ క్రమంలో హైపర్ సర్వీస్ క్యాంపెయిన్ ను లాంచ్ చేస్తున్నట్టు ఓలా శుక్రవారం ప్రకటన జారీ చేసింది. ప్రస్తుతం ఓలాకు 500 సర్వీస్ సెంటర్లు మాత్రమే ఉండగా.. వాటిని వెయ్యికి పెంచాలని భావిస్తోంది. అలాగే నెట్ వర్క్ ప్రోగ్రామ్ కింద లక్ష మంది థర్డ్ పార్టీ మెకానిక్ లకు శిక్షణను ఇవ్వనున్నట్టు తన ప్రకటనలో పేర్కొంది. ఈవీల వినియోగం, వాటిని రిపేర్ చేసేందుకు మెకానిక్ లను సిద్దం చేయడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. ఇక సర్వీస్ కోసం వచ్చిన బైకులు ఒకరోజు కంటే ఎక్కువ సమయం తీసుకుంటే ఆ కస్టమర్లు వినయోగించుకోవడానికి ఓలా ఎస్1 స్కూటర్ ఇవ్వనుంది. సర్వీస్ పూర్తయ్యే వరకు ఉచిత ఓలా క్యాబ్ కూపన్లు కూడా ఇస్తోంది.

Advertisement

Next Story

Most Viewed