అయోధ్య విమానాశ్రయంలో ఓలా క్యాబ్స్.. భక్తులకు సులభమైన ప్రయాణం: భవిష్ అగర్వాల్

by Disha Web Desk 17 |
అయోధ్య విమానాశ్రయంలో ఓలా క్యాబ్స్.. భక్తులకు సులభమైన ప్రయాణం: భవిష్ అగర్వాల్
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ రైడ్-హెయిలింగ్ కంపెనీ ఓలా సోమవారం అయోధ్యలోని వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయంలో క్యాబ్ సేవలు ప్రారంభించింది. ప్రస్తుతం రాముని దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారు, ఈ నేపథ్యంలో వారికి సులభమైన ప్రయాణాన్ని అందించడానికి ఈ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు కంపెనీ వ్యవస్థాపకుడు భవిష్ అగర్వాల్ తాజాగా ఒక ప్రకటనలో తెలిపారు. భారత్‌లో అత్యంత వేగంగా విస్తరిస్తున్న సాంస్కృతిక, పర్యాటక కేంద్రాలలో ఒకటిగా అయోధ్య ప్రాముఖ్యతను సంపాదించుకుంది. ప్రతి సంవత్సరం మిలియన్ల మంది పర్యాటకులను ఈ నగరం ఆకర్షిస్తుంది. ఇప్పటికే ఇక్కడ రవాణా సదుపాయాలు వేగంగా అభివృద్ది చెందుతున్నాయి. భక్తులకు మా పరంగా సహాయం చేయడానికి క్యాబ్ సేవలను తీసుకొచ్చినట్లు ఓలా తెలిపింది.

విమానాశ్రయంలో కార్యకలాపాలను సమర్థవంతంగా నిర్వహించడానికి Ola మొబిలిటీ 24x7 అందుబాటులో ఉన్న ఎగ్జిక్యూటివ్‌ల ప్రత్యేక బృందాన్ని నియమించింది. ఇటీవల ఎక్స్‌లో భవిష్ అగర్వాల్ వ్యాఖ్యానిస్తూ, ''నమస్తే అయోధ్య! అయోధ్య విమానాశ్రయంలో ఓలా క్యాబ్ సేవలు ప్రారంభించడం ఆనందంగా ఉంది, భారతీయులమైన మనకు ఈ ఆధ్యాత్మిక ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా అందుబాటులోకి తీసుకురావడానికి సహాయం చేస్తానని'' అన్నారు. 2022–2023 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ రూ. 250 కోట్ల లాభాన్ని ఆర్జించింది, గత ఆర్థిక సంవత్సరంలో జరిగిన రూ. 66 కోట్ల నష్టం కంటే గణనీయమైన మెరుగుదలను సాధించింది.



Next Story

Most Viewed