Chip maker: వారంలో $406 బిలియన్లను కోల్పోయిన Nvidia

by Harish |
Chip maker: వారంలో $406 బిలియన్లను కోల్పోయిన Nvidia
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్టిఫిషియల్-ఇంటెలిజెన్స్ చిప్‌మేకర్ అయిన Nvidia మార్కెట్ విలువ గత కొంత కాలంగా భారీగా క్షీణిస్తుంది. ఈ వారం విలువలో సుమారు $406 బిలియన్లను కోల్పోయినట్లు ఒక నివేదిక తెలిపింది. అమెరికా ఆర్థిక వ్యవస్థ ప్రభావం, AI వాణిజ్యంపై పెరుగుతున్న సవాళ్లు, ఇతర కంపెనీల నుంచి ఉన్న పోటీ కారణంగా కంపెనీ విలువ తగ్గినట్లు మార్కెట్ వర్గాలు తెలిపాయి. గత 30 ట్రేడింగ్ రోజులలో ఎన్విడియా షేర్లు $90.69 నుంచి $131.26 మధ్య ఉన్నాయి. మంగళవారం మార్కెట్ విలువ రికార్డు మొత్తం తుడిచిపెట్టుకుపోయింది. దీంతో గత రెండు వారాల్లో దాని విలువలో ఐదవ వంతు తగ్గిపోయింది.

$2.5 ట్రిలియన్ల విలువ కలిగిన కంపెనీ ప్రస్తుతం తీవ్ర ఆటుపోట్లను ఎదుర్కొంటుంది. అయితే ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఏఐ చిప్‌ల వాడకం విపరీతంగా పెరిగిన నేపథ్యంలో త్వరలో కంపెనీ షేర్లు పుంజుకుని సాధారణ స్థితికి చేరుకుంటాయని నిపుణులు భావిస్తున్నారు. Nvidia అతి పెద్ద కస్టమర్లు - Microsoft Corp., Meta Platforms Inc., Alphabet Inc., Amazon.com Inc., ఇవి దాదాపు 40 శాతం కంటే ఎక్కువ ఆదాయాన్ని అందిస్తున్నాయి.

Advertisement

Next Story

Most Viewed