Nissan layoffs: ఉద్యోగులకు నిస్సాన్ భారీ షాక్.. 9,000 మందికి ఉద్వాసన..!

by Maddikunta Saikiran |
Nissan layoffs: ఉద్యోగులకు నిస్సాన్ భారీ షాక్.. 9,000 మందికి ఉద్వాసన..!
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖ కంపెనీలకు కరోనా మహమ్మారి(Corona Epidemic) తర్వాత నుంచి ఆశించిన స్థాయిలో లాభాలు రాకపోవడంతో లేఆఫ్స్(layoffs)ను ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా జపాన్‌(Japan) దేశానికి చెందిన ఆటోమొబైల్ తయారీ సంస్థ ‘నిస్సాన్(Nissan)’ భారీగా లేఆఫ్స్‌కు సిద్ధమైంది. నిస్సాన్ మోటార్ కార్ల అమ్మకాలు తగ్గి, నష్టాలు సైతం పెరిగిపోవడంతో సంస్థ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా సెప్టెంబర్ త్రైమాసికం(September Quarter)లో నిస్సాన్ కంపెనీ 6 బిలియన్ డాలర్ల నష్టాన్ని చవిచూసింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా 9,000 మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు ప్రకటించింది. ఇందులో యూరప్‌లోనే 4,700 జాబ్స్ ఉన్నట్లు వెల్లడించింది. అలాగే కార్ల ఉత్పత్తిని 20% తగ్గిస్తామని తెలిపింది. తన సాలరీలో 50 శాతం కోత(50 Percent Cut) విధించుకుంటానని, తాము తీసుకునే చర్యలతో మళ్లీ పుంజుకుంటామని నిస్సాన్ సీఈఓ(Nissan CEO) మకోటో ఉచిద(Makoto Uchida) ధీమా వ్యక్తం చేశారు.

Advertisement

Next Story

Most Viewed