చరిత్ర సృష్టించిన నిఫ్టీ!

by Vinod kumar |
చరిత్ర సృష్టించిన నిఫ్టీ!
X

ముంబై: దేశీయ ఈక్విటీ మార్కెట్లు జోరును కొనసాగిస్తున్నాయి. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌(ఎన్‌ఎస్‌ఈ) రికార్డు స్థాయిలో దూసుకెళ్లింది. చరిత్రలోనే తొలిసారిగా నిఫ్టీ 20,000 మైలురాయిని తాకింది. దేశీయ సానుకూల పరిణామాలు సూచీ ర్యాలీకి దోహదపడ్డాయి. ముఖ్యంగా దేశీయ మదుపర్లు భారీగా కొనుగోళ్లకు దిగడం, దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన జీ20 సదస్సు విజయవంతమైన నేపథ్యంలో మార్కెట్లలో సెంటిమెంట్ పుంజుకుంది. జీ20 సమావేశాల్లో పలు కీలక ఒప్పందాలు జరగడం, ద్రవ్యోల్బణం తగ్గుతుందనే అంచనాలు, దేశీయంగా పలు రంగాల నుంచి లభించిన లభించడం, కీలక రిలయన్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కంపెనీల షేర్లలో పెద్ద ఎత్తున కొనుగోళ్లతో మార్కెట్లు ఊపందుకున్నాయి.

ఈ క్రమంలోనే బెంచ్‌మార్క్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీలు వరుసగా ఏడవ సెషన్‌లో లాభాలను సాధించాయి. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 528.17 పాయింట్లు ఎగసి 67,127 వద్ద, నిఫ్టీ 176.40 పాయింట్లు పుంజుకుని 19,996 వద్ద ముగిశాయి. నిఫ్టీలో మీడియా రంగం మాత్రమే బలహీనపడింది. మిగిలిన వాటిలో బ్యాంకింగ్, మెటల్, ఆటో రంగాలు రాణించాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో ఎల్అండ్‌టీ, బజాజ్ ఫైనాన్స్ కంపెనీల షేర్లు మాత్రమే నష్టాలను చూశాయి. మిగిలిన అన్నీ రాణించాయి. ముఖ్యంగా పవర్‌గ్రిడ్, యాక్సిస్ బ్యాంక్, మారుతీ సుజుకి, హెచ్‌సీఎల్ టెక్, ఎస్‌బీఐ, టాటా మోటార్స్, టాటా స్టీల్, నెస్లె ఇండియా స్టాక్స్ అధిక లాభాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 83.03 వద్ద ఉంది.

Advertisement

Next Story

Most Viewed