భారత్‌లో ఆశాజనకంగా ఉన్న జాబ్ మార్కెట్

by Harish |
భారత్‌లో ఆశాజనకంగా ఉన్న జాబ్ మార్కెట్
X

దిశ, బిజినెస్ బ్యూరో: ఈ ఏడాది రెండో త్రైమాసికంలో భారత్‌లో కొత్త నియామకాలు ఆశాజనకంగా ఉండే అవకాశం ఉంది. ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌లోని కంపెనీలు 36 శాతం ఎక్కువ హైరింగ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి. 80 శాతం కంపెనీలు ప్రతిభ కలిగిన అభ్యర్థుల కొరతతో ఇబ్బందులు పడుతున్నప్పటికీ ప్రపంచ దేశాల(22 శాతం సగటు)తో పోలిస్తే భారత్‌ హైరింగ్ యాక్టివిటీ విషయంలో 36 శాతంతో అగ్రస్థానంలో ఉంది. గత సంవత్సరంతో పోల్చినప్పుడు, ఈ ట్రెండ్ 6 శాతం పెరుగుతుంది. అదే మునుపటి త్రైమాసికంతో పోల్చితే 1 శాతం స్వల్ప తగ్గుదలగా ఉంది.

మ్యాన్‌పవర్‌గ్రూప్ ఎంప్లాయ్‌మెంట్ ఔట్‌లుక్ సర్వే ప్రకారం, దాదాపు 3,150 మంది కంపెనీల యజమానులు రెండవ త్రైమాసికంలో నియామకాల పరంగా సానుకూల దృక్పథాన్ని కలిగి ఉన్నారు. భారత్‌లో 40 శాతం ఉత్తరాది కంపెనీలు నియామకాలకు ఆసక్తి కలిగి ఉండగా, 35 శాతం పశ్చిమ ప్రాంత కంపెనీలు, సౌత్‌లో 33 శాతం కంపెనీలు కొత్త అభ్యర్థులను నియమించుకోవాలని చూస్తున్నాయి. అయితే ఈ విషయంలో ఈస్ట్ కంపెనీలు 30 శాతం తక్కువగా ఉన్నాయిని నివేదిక పేర్కొంది.

గత ఏడాదితో పోలిస్తే ప్రస్తుతం అన్ని రంగాలు సానుకూల వృద్ధిని కనబరుస్తున్నాయి. ఔట్‌లుక్ సర్వే ప్రకారం, పెద్ద పరిశ్రమల్లో నికర ఉపాధి పెరిగింది. హెల్త్‌కేర్, లైఫ్ సైన్సెస్ రంగాలు 44 శాతం బలమైన నియామకాలను కలిగి ఉండగా, ఆ తర్వాత స్థానంలో కమ్యూనికేషన్ సర్వీసెస్ 43 శాతం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగం 41 శాతం ఉన్నాయి. హెల్త్‌కేర్, లైఫ్ సైన్సెస్, రెన్యూవబుల్ ఎనర్జీ రంగాల్లోని పరిశ్రమలు వేగవంతమైన వృద్ధి రేటును చూస్తున్నాయని, భారత్ మెడికల్ టూరిజానికి కూడా ప్రముఖ గమ్యస్థానంగా మారుతోందని మ్యాన్‌పవర్‌గ్రూప్ ఉన్నతాధికారి సందీప్ గులాటి అన్నారు.

Advertisement

Next Story

Most Viewed