ప్రసార భారతి ఛైర్మన్‌గా నవనీత్ సెహగల్

by Harish |
ప్రసార భారతి ఛైర్మన్‌గా నవనీత్ సెహగల్
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రసార భారతి ఛైర్మన్‌గా మాజీ ఐఏఎస్ అధికారి నవనీత్ కుమార్ సెహగల్‌ను నియమించారు. సెలక్షన్ కమిటీ సిఫారసు మేరకు రాష్ట్రపతి ఈ నియామకాన్ని ఆమోదించారు. ఈ పోస్ట్ గత నాలుగేళ్లుగా ఖాళీగా ఉంది. చివరగా ఎ సూర్య ప్రకాష్ ఛైర్మన్‌గా ఉన్నారు. గరిష్ట వయోపరిమితి 70 ఏళ్లు చేరడంతో ఫిబ్రవరి 2020లో ఆయన పదవీకాలం ముగిసింది. అప్పటి నుంచి పోస్ట్ ఖాళీగా ఉంది. ఇప్పుడు తాజాగా కొత్త ఛైర్మన్‌‌ను నియమించారు. నవనీత్ బాధ్యతలు స్వీకరించిన తేదీ నుంచి మూడేళ్ల కాలానికి లేదా డెబ్బై ఏళ్ల వయస్సు వచ్చే వరకు, ఏది ముందైతే అది అమలులోకి వచ్చే వరకు పదవిలో ఉంటారు.

వైస్ ప్రెసిడెంట్ జగదీప్ ధన్‌ఖర్ అధ్యక్షతన జరిగిన ప్రసార భారతి ఛైర్మన్ ఎంపిక కమిటీ అతని నియామకానికి ప్రతిపాదించగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనను నియమించారు. ప్రసార భారతి జాతీయ టెలివిజన్ నెట్‌వర్క్ అయిన దూరదర్శన్, జాతీయ పబ్లిక్ రేడియో బ్రాడ్‌కాస్టర్ అయిన ఆల్ ఇండియా రేడియో కార్యకలాపాలను పర్యవేక్షిస్తుంది. కొత్త ఛైర్మన్‌గా సెహగల్ నియామకం తరువాత ఇన్నేళ్లు పూర్తి స్థాయి ఛైర్మన్‌ లేకుండా ఉన్నటువంటి సంస్థ కొత్త నాయకత్వంలో మరింత ముందుకు వెళ్తుందని అధికారులు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed