- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Elon Musk: భవిష్యత్తులో యుద్ధాలు ఏఐ, డ్రోన్‌లతోనే: ఎలన్ మస్క్
దిశ, బిజినెస్ బ్యూరో: గతంలో ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్(ఏఐ) మానవాళికి ముప్పు పొంచి ఉంటుందన్న టెక్ బిలియనీర్ ఎలన్ మస్క్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో జరిగే యుద్ధాల్లో ఏఐ, డ్రోన్‌లదే ఆధిపత్యం ఉంటుందని అభిప్రాయపడ్డారు. అమెరికా మిలిటరీ అకాడమీలో అభివృద్ధి చెందుతున్న ఆధునిక సంఘర్షణల గురించి తన అభిప్రాయాలను మస్క్ వ్యక్తం చేశారు. గతేడాది జరిగిన మిలిటరీ అకాడమీలోని ప్రసంగం తాజాగా విడుదలైంది. వీడియోలో ఎలన్ మస్క్ మాట్లాడుతూ.. ఉక్రెయిన్‌లో ఇప్పటికే జరుగుతున్న యుద్ధంలో డ్రోన్‌ల వాడకం సాధారణంగా ఉంది. ఒకవేళ పరిస్థితులు మారి యుద్ధం మరింత శక్తివంతంగా మారితే అది ఖచ్చితంగా డ్రోన్ యుద్ధమే అవుతుందని చెప్పారు. దీన్ని దృష్టులో ఉంచుకుని అమెరికా డ్రోన్‌ల ఉత్పత్తిని మరింత వేగవంతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. భవిష్యత్తులో జరిగే యుద్ధాలకు ముందుగానే సిద్ధమవ్వాలన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో సన్నిహిత సంబంధాల ద్వారా ఆ దేశ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్న ఎలన్ మస్క్, కంపెనీలను డ్రోన్‌ల కోసం పెట్టుబడులు పెట్టాలని, ఉత్పత్తిని గణనీయంగా పెంచాలన్నారు.