ప్రపంచవ్యాప్తంగా ఇళ్ల ధరల్లో మూడవ స్థానంలో ముంబై

by Harish |
ప్రపంచవ్యాప్తంగా ఇళ్ల ధరల్లో మూడవ స్థానంలో ముంబై
X

దిశ, బిజినెస్ బ్యూరో: గ్లోబల్ ప్రాపర్టీ అడ్వైజర్ నైట్ ఫ్రాంక్ ఇటీవల విడుదల చేసిన ప్రైమ్ గ్లోబల్ సిటీస్ ఇండెక్స్‌ ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా ఇళ్ల ధరలు ఎక్కువగా ఉన్న జాబితాలో ముంబై మూడో స్థానంలో నిలిచింది. భారీ ఎత్తున పెట్టుబడులు రావడం,ప్రధానంగా నగరంలో లగ్జరీ ఇళ్ల కొనుగోలుకు డిమాండ్ పెరగడం, బలమైన ఆర్థిక వాతావరణం నేపథ్యంలో ప్రజలు జీవనశైలిలో మార్పులు కోరుకుంటుండటం వలన గత ఏడాదితో పోలిస్తే ముంబైలో నివాస ఇళ్ల ధరలు దాదాపు 10 శాతం వృద్ధిని సాధించాయని నైట్ ఫ్రాంక్ తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా 45 నగరాల్లోని ప్రైమ్ రెసిడెన్షియల్ ధరల ఆధారంగా నైట్ ఫ్రాంక్ నివేదిక వెలువడింది.

2022 నాలుగో త్రైమాసికంలో 8వ స్థానంలో ఉన్న ముంబై ఐదు స్థానాలు ఎగబాకి మూడో స్థానానికి చేరుకుంది. ఇదే జాబితాలో ఫిలిప్పైన్స్ దేశానికి రాజధాని మనీలా 26.3 శాతం వార్షిక ధరల పెరుగుదలతో అగ్రస్థానంలో నిలిచింది. బలమైన దేశీయ, విదేశీ పెట్టుబడులు కారణంగా మనీలా మొదటి స్థానంలో ఉందని నివేదిక పేర్కొంది. అలాగే 15.1శాతం వార్షిక ధరల పెరుగుదలతో దుబాయ్ రెండో స్థానంలో ఉంది. ఇదే జాబితాలో ఢిల్లీ 16వ స్థానంలో బెంగళూరు 27వ స్థానంలో నిలిచాయి.

Advertisement

Next Story

Most Viewed