- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మోస్ట్ పాపులర్ యూజ్డ్ కార్ .. క్విడ్
దిశ,వెబ్‌డెస్క్: యూరప్ ఆటో మొబైల్ కంపెనీ రెనో విడుదల చేసే కార్లలో క్విడ్ .. ఎంట్రీ లెవల్ కారు. ఈ కారుకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఈ కార్ యూత్‌తో పాటు ఫ్యామిలీకి అనువైన కార్. అయితే క్విడ్ యూజ్డ్ కార్లకు కూడా మంచి డిమాండే ఉంది. పాత కార్ల మార్కెట్‌లో ఇది నంబర్ వన్ అని యూజ్డ్ కార్ రిటైలింగ్ ప్లాట్ ఫామ్ స్పిన్నీ పేర్కొంది. దీని అద్భుతమైన పెర్ఫార్మెన్స్, మంచి రీసేల్, విశ్వసనీయత, బెస్ట్ బిల్డ్ క్వాలిటీ కారణంగా సెకండ్ హ్యాండ్ మార్కెట్లో దీనికి డిమాండ్ కొనసాగుతోందని తెలిపింది. 2015లో ఈ కార్ మార్కెట్లోకి రాగా ఇప్పటి వరకు 4.4 లక్షల యూనిట్లు అమ్ముడుపోయాయి. ఇప్పటికీ దీని సేల్స్‌లో అద్భుత ఫలితాలను సాధిస్తోంది. చిన్నకార్ల విభాగంలో ఈ కారు తనదైన ముద్ర వేసుకుంది.
రెనాల్ట్ క్విడ్ హ్యాచ్‌బ్యాక్ రెండు రకాల ఇంజన్లతో వస్తుంది. ఇందులో 800 సీసీ త్రీ సిలిండర్ల పెట్రోల్ 54 బిహెచ్‌పి మరియు 72 ఎన్ఎమ్ పీక్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. మరొక ఇంజిన్ 1.0-లీటర్ పెట్రోల్ యూనిట్ రూపంలో వస్తుంది, ఇది 67 బిహెచ్‌పి మరియు 90 ఎన్ఎమ్ పీక్ టార్క్ అందిస్తుంది. రెండు ఇంజన్లు స్టాండర్డ్ 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో ఉంటుంది. 1.0-లీటర్ యూనిట్ కూడా అప్షనల్ AMT ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ను అందుకుంటుంది.
Also Read..
షేక్ చేస్తున్న మారుతీ సుజుకి బుకింగ్స్.. డెలివరీలకు సిద్ధంగా జిమ్మీ కార్లు