డేటా గవర్నెన్స్ క్వాలిటీ ఇండెక్స్‌‌లో రెండో స్థానంలో షిప్పింగ్ మంత్రిత్వ శాఖ

by Harish |   ( Updated:2023-05-13 06:13:43.0  )
డేటా గవర్నెన్స్ క్వాలిటీ ఇండెక్స్‌‌లో రెండో స్థానంలో షిప్పింగ్ మంత్రిత్వ శాఖ
X

న్యూఢిల్లీ: ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గాల మంత్రిత్వ శాఖ 2023 ఆర్థిక సంవత్సరం డిసెంబర్ త్రైమాసికానికి(Q3)కి డేటా గవర్నెన్స్ క్వాలిటీ ఇండెక్స్ (DGQI) లో రెండో స్థానంలో నిలిచింది. 66 మంత్రిత్వ శాఖల్లో నిర్వహించిన ఈ సర్వేలో ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గాల మంత్రిత్వ శాఖ(MoPSW) 5కి 4.7 స్కోర్‌ను సాధించి రెండో స్థానం పొందింది. డెవలప్‌మెంట్ మానిటరింగ్ అండ్ ఎవాల్యుయేషన్ ఆఫీస్ (DMEO), NITI ఆయోగ్ ద్వారా నిర్వహించబడిన ఈ సర్వే, కేంద్ర మంత్రిత్వ శాఖల పథకాలు, వాటి అమలు తీరుపై వచ్చిన సమీక్ష ఆధారంగా స్కోర్‌ను కేటాయిస్తుంది.

ఈ సందర్భంగా కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్ మాట్లాడుతూ, మంత్రిత్వ శాఖల పనితీరు ఆధారంగా నివేదికను రూపొందించడానికి DMEO, నీతి ఆయోగ్ చేసిన ప్రయత్నం చాలా ప్రశంసనీయం. ఇది ప్రభుత్వ విధానాలు, పథకాలు, కార్యక్రమాల అమలు ఫ్రేమ్‌వర్క్‌ను మెరుగుపరచడంలో, అనుకున్న లక్ష్యాలను సాధించడంలో సహయపడుతుందని అన్నారు.

Also Read...

బహుపాక్షిక అభివృద్ధి బ్యాంకులను బలోపేతం చేయాలి: నిర్మలా సీతారామన్

Advertisement

Next Story

Most Viewed