- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అమ్మకాల్లో సరికొత్త మైలురాయికి చేరుకున్న మారుతీ సుజుకి 'WagonR'
న్యూఢిల్లీ: దేశీయ అతిపెద్ద ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకి తన హ్యాచ్‌బ్యాక్ మోడల్ వ్యాగన్ఆర్ రెండు దశాబ్దాల్లో 30 లక్షల కార్లను విక్రయించినట్లు మంగళవారం ప్రకటనలో తెలిపింది. 1999లో కంపెనీ వ్యాగన్ఆర్ మోడల్‌ను దేశవ్యాప్తంగా అందుబాటులోకి తెచ్చిందని, 2008లో ఐదు లక్షల యూనిట్ల మైలురాయిని అధిగమించిన కారు, ఆ తర్వాత 2017లో 20 లక్షలు, 2021 నాటికి 25 లక్షలు, ఈ ఏడాది 30 లక్షల యూనిట్ల మార్కును చేరుకుంది.
ముఖ్యంగా హ్యాచ్‌బ్యాక్ విభాగంలో వ్యాగన్ఆర్‌కు వినియోగదారుల నుంచి అత్యంత ఆదరణ లభించిందని, ఎప్పటికప్పుడు కస్టమర్ల అభిరుచులకు అనుగుణంగా అప్‌డేట్ వెర్షన్‌ను తీసుకొచ్చామని కంపెనీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్(సేల్స్ అండ్ మార్కెటింగ్) శశాంక్ శ్రీవాస్తవ అన్నారు. కంపెనీ పోర్ట్‌ఫోలియోలో అత్యధికంగా ఎక్కువమంది కొనుగోలు చేసిన మోడల్ ఇదేనని ఆయన స్పష్టం చేశారు.
Also Read..