'Brezza'లో సీఎన్‌జీ వేరియంట్ విడుదల చేసిన మారుతీ సుజుకి!

by Harish |
Brezzaలో సీఎన్‌జీ వేరియంట్ విడుదల చేసిన మారుతీ సుజుకి!
X

న్యూఢిల్లీ: దేశీయ అతిపెద్ద ప్యాసింజర్ వాహన తయారీ సంస్థ మారుతీ సుజుకి తన కాంపాక్ట్ ఎస్‌యూవీ బ్రెజా మోడల్‌లో సీఎన్‌జీ వేరియంట్‌ను మార్కెట్లో విడుదల చేసింది. దీని ధరను రూ. 9.14 లక్షల నుంచి రూ. 12.05 లక్షల(ఎక్స్‌షోరూమ్) మధ్య నిర్ణయించినట్టు శుక్రవారం ప్రకటనలో తెలిపింది. బ్రెజా ఎస్-సీఎన్‌జీ వేరియంట్ 5స్పీడ్ మాన్యూవల్ ట్రాన్స్‌మిషన్‌తో అత్యధికంగా కిలోకు 25.51 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుందని కంపెనీ వెల్లడించింది.

ఇంధన ధరలు పెరుగుతున్న నేపథ్యంలో మెరుగైన మైలేజీ ఇచ్చే విధంగా కంపెనీలు సీఎన్‌జీ మోడళ్లను తీసుకొస్తున్నాయి. ఈ క్రమంలోనే మారుతీ సుజుకి తన ఎస్‌యూవీ కాంపాక్ట్ విభాగంలో అత్యంత ఆదరణ కలిగిన బ్రెజాలో సీఎన్‌జీ ట్రిమ్‌ను తీసుకొచ్చింది. ప్రస్తుతం ఈ కారును కొనేందుకు కస్టమర్లు రూ. 25 వేలు చెల్లించి బుకింగ్ చేసుకోవచ్చు.

ప్రస్తుతం మార్కెట్లో ఉన్న సాంప్రదాయ ఇంధన వేరియంట్ బ్రెజా మోడల్ ధర రూ. 7.99 లక్షల నుంచి రూ. 12.30 లక్షల మధ్య అందుబాటులో ఉంది. కొత్త బ్రెజా సీఎన్‌జీ మోడల్‌లో డిజైన్ పరంగా ఎలాంటి మార్పులు చేయలేదు. వెనక 328 లీటర్ల కెపాసిటీ గల బూట్ స్పేస్ సౌకర్యం ఉందని కంపెనీ పేర్కొంది.

Advertisement

Next Story