- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
రూ.4 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్ దాటిన మారుతీ సుజుకీ ఇండియా
దిశ, బిజినెస్ బ్యూరో: దిగ్గజ ఆటోమొబైల్ కంపెనీ మారుతీ సుజుకీ ఇండియా లిమిటెడ్ కీలక మైలురాయికి చేరుకుంది. మార్చి 27న కంపెనీ షేర్లు 23 శాతానికి పైగా పుంజుకోవడంతో దాని మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.4 లక్షల కోట్లను దాటింది. దీంతో ఈ ఘనత సాధించిన భారత లిస్టెడ్ కంపెనీల జాబితాలో మారుతీ సుజుకీ 19వ స్థానంలో నిలిచింది. బీఎస్‌ఈలో ఈ స్టాక్ రికార్డు గరిష్ట స్థాయి రూ.12,725ను తాకింది. ఇప్పటికే ఆర్‌ఐఎల్, టీసీఎస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఇన్ఫోసిస్, ఐసీఐసీఐ బ్యాంక్, భారతీ ఎయిర్‌టెల్, ఎస్‌బీఐ, LIC, HUL, ITC, L&T, బజాజ్ ఫైనాన్స్, అదానీ ఎనర్జీ, అదానీ గ్రీన్, HCL టెక్, అదానీ ఎంటర్‌ప్రైజెస్, కోటక్ మహీంద్రా బ్యాంక్, అదానీ టోటల్ గ్యాస్ సంస్థలు ఈ మైలురాయిని అధిగమించాయి.
మారుతీ సుజుకీ Q3FY24లో అంచనాలను మించి పోయింది. ప్రధానంగా ప్రీమియం యుటిలిటీ వెహికల్ విభాగంలో 60 శాతం వృద్ధి, బలమైన ఎగుమతి పనితీరును కనబరిచింది. అయితే పెరుగుతున్న ముడిసరుకు వ్యయాలు, పోటీ వాతావరణం మధ్య 2025 ఆర్థిక సంవత్సరంలో ఉత్పత్తి అనిశ్చితి కారణంగా భవిష్యత్ మార్జిన్ స్థిరత్వం గురించి ఆందోళనలు కొనసాగుతున్నాయి.
కొన్ని నివేదికల ప్రకారం, రాబోయే 2-3 ఏళ్లలో బలమైన హైబ్రిడ్ మోడల్ లాంచ్ చేసే అవకాశం ఉంది. SUV సెగ్మెంట్‌లో కొత్త బ్రెజ్జా, గ్రాండ్ విటారా, ఫ్రాంక్స్ వంటి మోడల్స్ అభివృద్ధి చెందుతున్న SUV మార్కెట్లో మార్కెట్ వాటాను పొందేందుకు మారుతీ సుజుకీకి సహాయపడుతున్నాయని విశ్లేషకులు తెలిపారు.