- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘ఇన్విక్టో’ కారును విడుదల చేసిన మారుతీ సుజుకి!
న్యూఢిల్లీ: దేశీయ అతిపెద్ద ప్యాసింజర్ వాహన తయారీ సంస్థ మారుతీ సుజుకి తన పోర్ట్‌ఫోలియోలోనే అత్యంత ఖరీదైన మల్టీ-పర్పస్ వెహికల్ మోడల్ ఇన్విక్టో కారును బుధవారం విడుదల చేసింది. దీని ప్రారంభ ధర రూ. 24.79 లక్షలుగా నిర్ణయించామని, టాప్-ఎండ్ మోడల్ ధర రూ. 28.42 లక్షల వరకు ఉంటుందని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. మూడు వరుసలతో వస్తున్న ఇన్విక్టో కారులో జీటా ప్లస్(7-సీటర్) ధర రూ.24.79 లక్షలు, జీటా ప్లస్(8-సీటర్) ధర రూ. 24.84 లక్షలు, ఆల్ఫా ప్లస్(7-సీటర్) ధర రూ.28.42 లక్షలతో వంటి మూడు వేరియంట్లు ఉన్నాయి. భద్రతా పరంగా ఆరు ఎయిర్‌బ్యాగులు, హిల్ హోల్డ్ అసిస్ట్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ వంటి అత్యాధునిక ఫీచర్లను అందిస్తున్నట్టు కంపెనీ వెల్లడించింది.
ఇన్విక్టో మోడల్ ద్వారా కంపెనీ రూ.20 లక్షలకు పైన సెగ్మెంట్‌లో మార్కెట్ వాటాను దక్కించుకోవాలనే లక్ష్యాన్ని కలిగి ఉంది. 2.0 లీటర్ ఎలక్ట్రిక్ హైబ్రిడ్ సిస్టమ్‌తో వచ్చిన ఇన్విక్టోలో డ్రైవ్ మోడ్ కలర్ థీమ్‌తో పాటు వన్ టచ్ పవర్‌టెయిల్ గేట్, డ్యూయెల్ జోన్ క్లైమెట్ కంట్రోల్ 360 డిగ్రీ వ్యూ మానిటర్, పనొరమిక్ సన్‌రూఫ్ వంటి ఫీచర్లు ఉన్నాయని కంపెనీ వివరించింది. ఇప్పటికే కంపెనీ బ్రెజా, ఎక్స్ఎల్6, ఎర్టిగా వంటి మోడళ్లతో యూవీ సెగ్మెంట్‌లో మెరుగైన వాటాను కొనసాగిస్తోంది. ప్రీమియం విభాగంలోనూ సత్తా చాటాలని భావిస్తున్నామని మారుతీ సుజుకి మార్కెటింగ్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ శశాంక్ శ్రీవాస్తవ పేర్కొన్నారు.